సుచిత్రా కృష్ణమూర్తి… అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు. కానీ ఈమె తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తే. 1991వ సంవత్సరంలో మలయాళంలో రూపొందిన ‘కిలుక్కింపెట్టి’ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. జయరామ్ కు జోడీగా ఆ సినిమాలో నటించింది.అటు తర్వాత ‘శివరంజని’ తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది.అటు తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘జజ్బాత్ ఆగ్’ ‘కభీ హా కభీ నా’ ‘రోమియో అక్బర్ వాల్టర్’ వంటి చిత్రాలతో ఇంకాస్త ఎక్కువ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
వాస్తవానికి ఆమె సింగర్ కావాలని భావించింది.అందుకే నటిగా మారిన తర్వాత కూడా సింగర్ గా పలు సినిమాల్లో పాటలు పాడింది. గతంలో ఈమె శేఖర్ కపూర్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ 2007లో విడాకులు తీసుకుంది. ఈ దంపతులకి కావేరి కపూర్ అనే పాప కూడా ఉంది. ఇటీవల ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘శేఖర్ కపూర్ నిజాయితీగా లేడు. ఈ విషయం నాకు చాలా ఆలస్యంగా అర్ధమైంది. మా విడాకులకు హీరోయిన్ ప్రీతి జింటా కారణం.
మా మధ్య చిచ్చు పెట్టింది (Actress) ఆమెనే. జన్మలో నేను ఆమెను క్షమించను.’ అంటూ ఘాటుగా స్పందించింది సుచిత్రా కృష్ణమూర్తి. ఈమె వ్యాఖ్యలకి ప్రీతి జింటా కూడా ఘాటుగానే జవాబిచ్చింది అని చెప్పాలి. ‘నేను స్టార్ హీరోయిన్ గా రాణించాను. సుచిత్రా చేసింది ఏమీ సాధించింది లేదు. ఆమె మానసిక స్థితి కూడా సరిగా లేనట్టు ఉంది. అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది ప్రీతి జింటా.
‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!
ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!