Anil Ravipudi: రష్మిక నొ చెప్పింది.. ‘బీస్ట్’ ‘ఆచార్య’ సెంటిమెంట్ రిపీట్ అవ్వదు కదా..!

అపజయమెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడికి ఓ సెంటిమెంట్ ఉంది. కెరీర్ ప్రారంభం నుండీ అతని ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. ‘పటాస్’ నుండీ ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యాడు. ఇంతకీ ఏంటి ఆ సెంటిమెంట్ అంటే… అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘పటాస్’ లో శృతి సోది హీరోయిన్ గా నటించింది. ఈ భామతో ‘సుప్రీమ్’ లో ఓ స్పెషల్ సాంగ్ చేయించాడు అనిల్.

తర్వాత ‘రాజా ది గ్రేట్’ లో .. ‘సుప్రీమ్’ హీరోయిన్ రాశీ ఖన్నా తో గెస్ట్ అప్పీరెన్స్ ఇప్పించాడు. ‘ఎఫ్ 2’ లో రెండో హీరోయిన్ గా నటించిన మెహ్రీన్… అంతకు ముందు ‘రాజా ది గ్రేట్’ లో కూడా హీరోయిన్ గా నటించింది..! ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ‘ఎఫ్ 2’ హీరోయిన్ తమన్నా ఓ పాటలో డ్యాన్స్ చేసింది. ఇదే క్రమంలో ‘ఎఫ్3’ లో కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ హీరోయిన్ రష్మిక తో ఓ స్పెషల్ సాంగ్ చేయించాలి అనుకున్నాడు.

ఈ ఒక్క పాట కోసం రూ.1 కోటి డిమాండ్ చేసిందట రష్మిక. దాంతో రూ.75 లక్షలకి పూజా హెగ్డేతో చేయిస్తున్నారు. పూజా హెగ్డే ఈ పాటకి ఒప్పుకోవడం చాలా గ్రేట్ అనే చెప్పాలి. అయితే అనిల్ హిట్ సెంటిమెంట్ ఇక్కడ బ్రేక్ అయినట్టేనా అని అంతా సందేహపడుతున్నారు. అయితే ఈ మూవీలో వెంకటేష్ సరసన నటిస్తున్న తమన్నా.. ‘సరిలేరు నీకెవ్వరు’ లో సాంగ్ చేసింది కాబట్టి.. ఆ సెంటిమెంట్ అలా కంటిన్యూ అయిపోతుంది అని అనిల్ నమ్ముతున్నాడట.

అయితే ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే నటించిన సినిమాలు అన్నీ ప్లాప్ అవుతున్నాయి. ముఖ్యంగా రష్మిక నొ చెప్పి.. పూజా హెగ్డే చేసిన ‘బీస్ట్’ ‘ఆచార్య’ సినిమాలు పెద్ద ప్లాప్ అయ్యాయి. మరి ‘ఎఫ్3’ కి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? అనేది చూడాలి..!

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus