Actor Naresh: సీనియర్ నటుడి నరేష్ ట్వీట్ పై ట్రోలింగ్.. తిరుపతిలో అవి దొరకలేదట..!

సీనియర్ నటుడు ఒకప్పుడు హీరోగా రాణించిన వారే. ఇప్పుడు సహాయ నటుడిగా కూడా స్టార్ యాక్టర్ గా దూసుకుపోతున్నారు. సినిమాల వరకు ఈయనకి పేరు పెట్టాల్సిన పనిలేదు. అయితే రియాలిటీకి వచ్చే సరికి ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా ‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల సమయంలో ఈయన చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. గతంలో నరేష్.. శివాజీ రాజా పై గెలిచినప్పుడు ఇతను చేసిన హడావిడి అందరూ చూసారు.

ఆ టైములో ‘నేను ఈ ఒక్క టర్మ్ కే ప్రెసిడెంట్ గా పోటీచేశాను, తర్వాత చేయను’ అని చెప్పిన నరేష్, ఈసారి మంచు విష్ణుని నిలబెట్టి మిగిలిన సభ్యుల పై ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుని వార్తల్లో నిలిచాడు. ఇటీవల అయితే తన మూడో భార్య నరేష్ పేరు చెప్పి డబ్బులు కాజేస్తుంటే ఆమెతో తనకి సంబంధం లేదని చెప్పి హాట్ టాపిక్ అయ్యాడు. ఇవన్నీ అయిపోయాయి అనుకుంటే ఇప్పుడు మరోసారి ట్రోలింగ్ కు గురయ్యాడు నరేష్.

విషయం ఏంటంటే.. నరేష్ ఇటీవల తిరుపతి వెళ్ళాడు. వచ్చే టైంకి ఓ ట్వీట్ వేసాడు. అంతే ట్రోలింగ్ మొదలైంది. అందులో తప్పేముంది అని మీరు అనుకోవచ్చు. నరేష్ వేసిన ట్వీట్ తెలిస్తే ఇలా ఎవ్వరూ అనుకోరు. ‘తిరుపతి వచ్చాను. గంట నుండీ తిరుగుతున్నా నాకు కావాల్సిన నైక్ ఏయిర్ షూస్ మాత్రం దొరకలేదు. ఇక హైదరాబాద్ తిరిగి వెళ్లాల్సిందే’ అంటూ ట్వీట్ వేశాడు నరేష్. దీనికి నెటిజన్లు…

‘గంటలో ఏమి తిరిగేశావ్, ఆ డబ్బా బ్యాచ్ మంచు ఫ్యామిలీతో తిరుగుతూ నువ్వు కూడా అలాగే తయారయ్యావు’ అంటూ విరుచుకుపడుతున్నారు. మరికొంతమంది అయితే ‘తిరుపతి వెళ్ళిన నీకు బ్రాండెడ్ షూస్ తో పనేముంది’ అంటూ నరేష్ ను ప్రశ్నిస్తున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus