ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నుండి వచ్చిన ‘సెల్ఫీ’ చిత్రం దారుణంగా ప్లాప్ అయ్యింది. ఈ సినిమాకి మొదటి రోజు కేవలం రూ.2 కోట్లు కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. రాజ్ మెహతా డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని హిరూ యష్ జోహార్, అరుణ్ భాటియా, సుప్రియ మీనన్, కరణ్ జోహార్, పృథ్వీరాజ్ సుకుమారన్,అపూర్వ మెహతా, స్టీఫెన్ వంటి వారు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇది మలయాళంలో హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ కు రీమేక్.
ఇక బడ్జెట్ లో అక్షయ్ కుమార్ పారితోషికమే రూ.100 కోట్ల వరకు ఉందని వినికిడి. అయితే ఈ సినిమా మొదటి రోజు కేవలం రూ.2 కోట్ల వసూళ్లనే సాధించింది.రెండో రోజు, మూడో రోజు కలుపుకుని రూ.10 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది.సోమవారానికి అడ్వాన్స్ బుకింగ్స్ కనీసం 5 శాతం కూడా లేవు. ఇలాంటి టైంలో ట్రోలర్స్ ఖాళీగా ఉంటారా? ఏకధాటిగా అక్షయ్ కుమార్ ని ట్రోల్ చేసే పని పెట్టుకున్నారు.
రూ.100 కోట్లు పారితోషికం తీసుకునే స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రూ.2 కోట్లా అంటూ నెగిటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు అక్షయ్ ను మగ కంగనా అంటూ విమర్శిస్తున్నారు. ఎందుకంటే అక్షయ్, కంగనా ఇద్దరూ కూడా బీజేపీ కి అనుకూలంగా ఉండే నటులు. కొంతకాలంగా కంగనా సినిమాలు కూడా వరుసగా ప్లాప్ అవుతున్నాయి. ఇక అక్షయ్ నటించిన బెల్ బాటమ్, బచ్చన్ పాండే, రక్షాబంధన్, పృథ్వీరాజ్, రామ్ సేతు, సెల్ఫీ…
వంటి సినిమాలతో అరడజను ప్లాపులు ఎదుర్కొన్నాడు. వీటిలో ఒక్క సినిమాకి కూడా సరైన ఓపెనింగ్ రాలేదు. ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్.. ఇప్పుడు ఇలా డౌన్ అవ్వడం అతని అభిమానులను చాలా నిరుత్సాహపరుస్తుంది. నెక్స్ట్ సినిమాలతో అయినా ఫామ్లోకి వస్తాడేమో చూడాలి.