Anasuya: వివాదాస్పదమైన అనసూయ ట్వీట్.. ఓ రేంజ్లో సెటైర్లు..!

Advertisement

అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఆమె కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తుండడంతో పాటు పలు అంశాల పై కూడా ఆమె స్పందిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు అవి వివాదాస్పదమైన సందర్భాలు కూడా ఉన్నాయి.అయినా అనసూయ వాటిని ఎదుర్కొంటూనే వస్తుంది. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితి ఆమెకు ఎదురయ్యింది. విషయం ఏంటంటే… ఉమెన్స్ డే సందర్భంగా చాలా మంది శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ లు పెట్టారు. దీని పై అనసూయ తన స్టైల్ లో స్పందించింది. ‘అదేంటి… సడెన్ గా ఈరోజు ట్రోలర్స్, మీమ్ మేకర్స్ అంతా మహిళలను గౌరవించడం మొదలుపెట్టారు.

ఇది ఎలాగూ 24 గంటల్లోనే అంతరించిపోతుందని తెలుసు.కాబట్టి మహిళలందరికీ హ్యాపీ ఫూల్స్ డే’ అంటూ ట్వీట్ చేసింది. అనసూయ ఇలా వెటకారంగా స్పందించడంతో నెటిజన్లు అంతా మండిపడుతున్నారు. అంతేకాదు అనసూయ పై ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. ‘జబర్దస్త్’ లో హైపర్ ఆది వంటి వాళ్ళు నీ పై బోల్డ్ కామెంట్స్ చేస్తే హ్యాపీగా నవ్వుకుంటావ్,ఇక్కడ మాత్రం నీకు గౌరవం వంటివి గుర్తొచ్చేస్తాయి’, ‘ ‘మథర్ తెరిస్సా’ వంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, మేము విషెస్ చెప్పింది వాళ్ళకి నీకు కాదులే’ అంటూ ఓ రేంజ్లో మండిపడుతున్నారు.

ఇక బుల్లితెరతో పాటు వెండితెర పై కూడా అనసూయ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతుంది. ‘ఖిలాడి’ సినిమాలో గ్లామర్ డోస్ కూడా పెంచి యూత్ ను షాక్ కు గురించి చేసింది అనసూయ.

1

2

3

4

5

6

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus