ప్రోస్తెటిక్ మేకప్ సౌత్ ఇండస్ట్రీకి కొత్త కాదు. కమల్ హాసన్, విక్రమ్ ల పుణ్యమా అని ఇప్పటికే చాలాసార్లు ఆ ప్రోస్తెటిక్ మేకప్ ఎలా ఉంటుంది అనేది చూసేసాం. అయితే.. మొన్న విడుదలైన “తలైవి” ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ.. టీజర్ కానీ.. ఆశించిన స్థాయిలో లేవు. ముఖ్యంగా జయలలితలా కంగనాను చూపించడం కోసం ఆమెకు వేసిన ప్రోస్తెటిక్ మేకప్ మరీ గలీజుగా ఉంది. షాపింగ్ మాల్స్ ముందు ఛోటా భీమ్ కాస్ట్యూమ్ వేసుకొని నిల్చోనే కుర్రాలను తలపించింది కంగన.
లో బడ్జెట్ లో రవిబాబు తీసిన “లడ్డు బాబు”లో బక్కపలుచని నరేష్ కూడా బొద్దుగా చక్కగా కనిపించాడు. కానీ.. కంగనకు మాత్రం ఎందుకో ఈ ప్రోస్తెటిక్ సరిగా సెట్ అవ్వలేదు. అంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా విషయంలో మేకర్స్ ఇలాంటి విషయాలను గాలికి వదిలేయడం అనేది శోచనీయం. ఫస్ట్ లుక్ తో కనీస స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయిన “తలైవి” అండ్ టీం సినిమాతో ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకొంటారో చూడాలి.