Kareena Kapoor: స్టార్ హీరోయిన్ కరీనా పై ట్రోలింగ్.. చీప్ అంటూ కామెంట్స్..!

సినిమా సెలబ్రిటీలు ట్రెండీగా కనబడడానికి ఇష్టపడతారు. అందుకోసం ఫ్యాషన్ ను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఒకసారి ధరించిన దుస్తులు మళ్ళీ మళ్ళీ ధరిస్తారా? అంటే అనుమానమే.రోజులో వాళ్ళు వాకింగ్‌, జాగింగ్‌,యోగా, పార్టీ, డిన్నర్‌ , ఇలా సందర్భానుసారంగా వేటికి తగ్గట్టు ఆ దుస్తులు ధరిస్తూ ఉంటారు.వెకేషన్ కు ఎక్కడికి వెళ్లినా షాపింగ్ ఎక్కువగా చేస్తుంటారు.అయితే హీరోలైనా, హీరోయిన్లు అయినా ఒక్కోసారి వారి వస్త్రాలంకరణ అటు.. ఇటు గా.. ఉంటే విమర్శలు పాలవ్వడం మామూలే.

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత వాళ్ళ పై రెగ్యులర్ గా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. తాజాగా ఇప్పుడు కరీనా కపూర్ ట్రోలర్స్ కు దొరికిపోయింది. తాజాగా కరీనా గుస్సీ ఎల్లో టీషర్ట్‌తో బయట దర్శనమిచ్చింది.ఆమె చేతిలో జాకెట్ కూడా ఉంది.అక్కడ ఉన్న ఫోటో గ్రాఫర్లు కరీనాని క్లిక్ మనిపించారు.ఈ ఫోటోల్లో ఆమె లుక్ కొంచెం తేడాగానే ఉంది.దాంతో ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ మాత్రం దొరికితే ట్రోలర్స్ వదులుతారా?

ఘోరాతి ఘోరమైన కామెంట్లతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆ టీ షర్ట్ ధర కూడా తక్కువేం కాదు. ఏకంగా రూ.40 వేలు విలువగల టీ షర్ట్ అది. అంత డబ్బు పెట్టినప్పుడు ఇలాంటి చీప్ టీషీర్ట్ కొనడం ఏంటి? అంటూ కొంతమంది నెటిజెన్ల రెచ్చిపోతున్నారు. మరికొంతమంది అయితే ‘మేము రూ.150 పెట్టినా..

ఇంత కంటే మంచి టీ షర్ట్ తీసుకుంటాము.. కరీనాది మరీ చీప్ టేస్ట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వరలో ఈమె ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘లాల్ సింగ్ చద్దా’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus