పాయల్ రాజ్ పుత్ మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. అంతేకాదు నటనతోనూ, గ్లామర్ తోనూ దుమ్ము దులిపేసింది. కామంతో రగిలిపోతూ ఓ అబ్బాయిని వెంట తిప్పుకుని… వాడుకుని వదిలేసి.. సిగిరెట్లు కూడా తాగే.. బోల్డ్ పాత్ర పోషించి కుర్ర కారుని సైతం తెగ ఆకర్షించింది. ఈ చిత్రం విజయంలో ఆమెది 70 శాతం క్రెడిట్ కొట్టేసింది కాబట్టి… ఆమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి. ఈ క్రమంలో రవితేజ సరసన ‘డిస్కో రాజా’ ‘వెంకీమామ’ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి.
సీనియర్ హీరో అయినప్పటికీ… వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ.. యూత్ లోనూ మంచి రెస్పెక్ట్ ఉంది. అలాంటి వెంకటేష్ సరసన నటించే అవకాశం ఇచ్చారు అంటే.. ఆ హీరోయిన్ ను ఎలా చూస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మరోపక్క పాయల్ ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ అనే అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలో నటిస్తుంది. శృంగార సన్నివేశాలకి ఏమాత్రం మొహమాట పడకుండా… ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ చిత్రంలో రెచ్చిపోయిందని విడుదలైన టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. ఈ టీజర్ పై ప్రేక్షకులు ‘వెంకీమామ’ సినిమాలో వెంకటేష్ తో సరసన నటిస్తూ ఇలాంటి బూతు సినిమ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ‘వెంకీమామ’ నిర్మాతల్ని కూడా ట్యాగ్ చేస్తున్నారు. దీంతో ‘వెంకీమామ’ టీం చిరాకు పడుతున్నారట. కానీ సినిమా ఫైనల్ స్టేజిలో ఉంది కాబట్టి పాయల్ ను కూడా ఏమీ అనలేని పరిస్థితుల్లో వారున్నారని చిత్ర యూనిట్ సభ్యుల సమాచారం.