Priyanka Singh: ఇప్పుడు డిలీట్ చేసి ఉపయోగమేంటి.. ప్రియాంక సింగ్ కు షాకిచ్చిన నెటిజన్లు!

‘జబర్దస్త్’ లో లేడీ గెటప్ లు వేసి పాపులారిటీ సంపాదించుకున్న సాయి తేజ తర్వాత జెండర్ మార్చుకుని ప్రియాంక సింగ్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత బిగ్ బాస్ 5 లో ఎంట్రీ ఇచ్చి అతను మరింత క్రేజ్ ను సంపాదించుకున్నాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రియాంక సింగ్… మానస్ అనే మరో కంటెస్టెంట్ తో సన్నిహితంగా ఉండడం, ప్రేమ,రొమాన్స్, పెళ్లి అంటూ ఏవేవో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

మానస్ హజ్బెండ్ మెటీరియల్ అంటూ హౌస్ లో చాలా రచ్చ చేసింది ప్రియాంక సింగ్. అయినప్పటికీ ప్రియాంక సింగ్ .. ట్రాన్స్ జెండర్ కాబట్టి.. ఆమె పై సింపతీ ఏర్పడింది. సమాజం వారిని కూడా ప్రోత్సహించాలి అంటూ ఆమెను ప్రతి నామినేషన్ లో సేఫ్ చేసేవారు నెటిజన్లు. అందుకే ఆమె 13 వారాల పాటు హౌస్ లో ఉండి టాప్ 7 లో నిలిచింది. హౌస్ లో నుండి బయటకు వచ్చాక.. ఈమె సినిమాల్లో బిజీ అవుతుంది అని అంతా అనుకున్నారు.

అవసరమైతే గ్లామర్ రోల్స్ కూడా చేస్తాను అంటూ ప్రియాంక సింగ్ (Priyanka Singh) ఓపెన్ గానే చెప్పుకొచ్చింది. అలా చెప్పినా ఆమెకు అవకాశాలు రావడం లేదు. అలా అని ఈమె తన ప్రయత్నాలు మానుకోవడం లేదు. అందుకోసం తాజాగా ఆమె గ్లామర్ ఫోటో షూట్లో పాల్గొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల పై నెగిటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.

దీంతో ఓ ఫోటోని ఆమె డిలీట్ చేయడం కూడా జరిగింది. కానీ అప్పటికే ఆ ఫోటోని నెటిజన్లు డౌన్లోడ్ చేసినట్లు చెప్పి ఆమెకు షాకిచ్చారు. ‘నీకు ఇచ్చిన విలువంతా పోగొట్టుకున్నావ్. అవకాశాల కోసం మరీ ఇంత దిగజారిపోవాలా’ అంటూ ఈమె పై మండిపడుతున్నారు నెటిజన్లు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus