Samantha: కుక్కకి బర్త్ డే విషెస్ చెబుతూ రచ్చ చేసిన సామ్.. ట్రోలింగ్ షురూ..!

నవంబర్ 23న(నిన్న) నాగ చైతన్య పుట్టిన రోజు కావడంతో అక్కినేని అభిమానులు చైతన్యకి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషెస్ చెప్పారు. టాలీవుడ్ నుండి కూడా కొందరు సెలబ్రిటీలు చైతన్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే చైతన్య మాజీ భార్య అయిన సమంత విషెస్ చెప్పలేదు. అయినప్పటికీ అది ఆమె వ్యక్తిగతం అని సరిపెట్టుకోవచ్చు. కానీ చైతన్య ఫ్యాన్స్ కు మండేలా ఈ రోజున సమంత పెట్టిన పోస్ట్ ఒకటి పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

విషయం ఏంటంటే సమంత తన పెంపుడు కుక్క ‘హష్‌’ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఈరోజు తన ఇన్స్టా స్టోరీస్ లో ఓ పోస్ట్ చేసింది.దీనికి చైతన్య ఫ్యాన్స్ మండిపడుతూ సమంత పై తిట్ల వర్షం కురిపించారు. ‘పెంపుడు కుక్కకి అంత ప్రాధాన్యత ఇచ్చే నువ్వు విడాకులు తీసుకునే ముందు స్నేహితుడని చెప్పిన నాగ చైతన్యను ఎలా మరిచిపోయావ్?’ అంటూ వారు నిలదీస్తున్నారు.మొత్తానికి సమంత పోస్ట్ చూస్తుంటే చైతన్య పై చాలా పగ ఉన్నట్టు స్పష్టమవుతుందని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దీనిని బట్టి వీరు విడాకులు తీసుకోవడానికి జరిగిన గొడవ ఆషామాషీది కూడా కాదని ఈ పోస్ట్ తో అందరికీ ఓ ఐడియా వచ్చింది. అక్టోబర్ 2న చైతన్య- సమంత లు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అంతకు ముందే ఈ విషయం పై చాలా వార్తలు వచ్చినా వాటి పై చైసామ్ లు త్వరగా క్లారిటీ ఇవ్వలేదు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus