Tamannaah: పాపం తమన్నాను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోల అందరి సరసన నటించారు. ప్రస్తుతం చిరంజీవి చిత్రమైన భోళాశంకర్ తో బిజీగా ఉన్న ఈ భామ వెబ్ సిరీస్ వైపు తన దృష్టిని మళ్ళించింది. ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది తమన్నా. ఈ వెబ్ సిరీస్ తో పాటుగా తమన్నా నటించిన జీ కర్దా అనే మరొక వెబ్ సిరీస్ ఈరోజు అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవ్వనుంది.

ఏడుగురు అమ్మాయిలు జీవితాల ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన ఈ సిరీస్ కంప్లీట్ గా గర్ల్ స్టోరీస్ మీద ఆధారితమైంది. అయితే ఇటీవల నటించిన వెబ్ సిరీస్ లో మాత్రం తమన్నా కొన్ని ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించి ప్రేక్షకులను షాప్ కి గురి చేశారు. అందాల ఆరబోత మరియు హాట్ సీన్స్ నటించే విషయంలో తమన్నా తీరు శృతి మించింది అంటూ పలువురు అంటున్నారు. ఇప్పటివరకు తమన్నా ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ ఇటువంటి బోల్డ్ సీన్స్ లో మాత్రం ఎప్పుడూ కనిపించలేదు.

కానీ ఇటీవల నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో మాత్రం ఇంతకు ముందు ఎన్నడూ కనిపించనంత హాట్ గా కనిపించడంతోపాటు కొన్ని సన్నివేశాల్లో బోల్డ్ డైలాగ్స్ ని కూడా చెప్పారు. కొన్ని రోజులుగా తమన్నా మరియు విజయ్ వర్మ లస్ట్ స్టోరీస్ టు వెబ్ సిరీస్ లో లిప్ లాక్ సన్నివేశాలలో నటించిన విషయం ఎంత బాగా వైరల్ అవుతుందో మనకి తెలిసిన విషయమే. దీంతో అందరూ (Tamannaah) తమన్నాను మరో సన్నీ లియోన్తో పోలుస్తున్నారు.

అయితే తమ అభిమాన నటి నోటి నుండి ఇటువంటి బోల్డ్ డైలాగులతో పాటు ఇంత ఇంటిమేట్ సన్నివేశాలలో నటించడం అనే విషయం మాత్రం ప్రేక్షకులకు గట్టి షాప్ ని ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. కొందరు అయితే తమ ప్రియమైన నటి తమన్నాను ఇటువంటి సీన్లలో చూడలేకపోతున్నామంటూ కామెంట్లు పెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్లో ఇటువంటి సీన్స్ లో నటించిన విషయం పై తమన్న నిటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus