Rana , Rajasekhar: రానా రాజశేఖర్ కాంబో మూవీ అలా ఉండబోతుందా?

  • July 12, 2023 / 01:04 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన రానాకు సోలో హీరోగా నటించిన సినిమాలతో పోల్చి చూస్తే మల్టీస్టారర్ రోల్స్ లో నటించిన సినిమాలే మంచి పేరును తెచ్చిపెట్టాయి. రానా మరో మల్టీస్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది. రానా, రాజశేఖర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కనుందని వైరల్ అవుతున్న వార్తల సమాచారం. దర్శకుడు తేజ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

అహింస సినిమా తర్వాత తేజ (Rana) రానా హీరోగా రాక్షస రాజా పేరుతో ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం తేజ రాజశేఖర్ ను ఎంపిక చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో రాజశేఖర్ సోలో హీరోగా సినిమాలలో ఎక్కువగా నటించడం లేదు. ఈ మల్టీస్టారర్ లో రాజశేఖర్ నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. రానా, రాజశేఖర్ బ్రదర్స్ గా కనిపిస్తారని సమాచారం అందుతోంది. వైరల్ అవుతున్న ఈ వార్తకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. రానా, రాజశేఖర్ కలిసి నటిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే కమర్షియల్ గా కూడా సంచలనాలు సృష్టించే అవకాశం అయితే ఉంటుంది.

ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. రాజశేఖర్, రానా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఈ మధ్య కాలంలో తేజ సినిమాలు సైతం అంచనాలను అందుకోలేదు. రాక్షస రాజు సినిమా మాత్రం ఆ సెంటిమెంట్లను బ్రేక్ చేసి కమర్షియల్ గా హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus