Salaar: సలార్ మూవీ ఫ్యాన్స్ కు తీపికబురు.. సెన్సార్ ఎప్పుడంటే?

  • November 28, 2023 / 11:31 AM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ నుంచి డిసెంబర్ నెల 1వ తేదీన ట్రైలర్ విడుదల కానుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ వస్తున్నాయి. మరో మూడు రోజుల్లో ఈ సినిమా సెన్సార్ పూర్తి కానుందని తెలుస్తోంది. అయితే సెన్సార్ నిబంధనలు కఠినం అయ్యాయని సెన్సార్ టాక్ బయటకు వచ్చే ఛాన్స్ లేదని భోగట్టా.

సలార్ (Salaar) ట్రైలర్ రిలీజ్ సమయానికే ఈ సినిమా సెన్సార్ పూర్తయ్యేలా అడుగులు పడ్డాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సినిమా రిలీజ్ కు 20 రోజుల ముందే సెన్సార్ ను పూర్తి చేస్తే రిలీజ్ ముందు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్మీ నేపథ్యంలో సలార్ తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతుండగా సలార్ ట్రైలర్ రిలీజ్ తర్వాతే పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ను మాత్రం సలార్ నిరాశపరిచే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

సలార్2 సినిమాకు సంబంధించి అప్ డేట్ కూడా సలార్ ప్రమోషన్స్ లో భాగంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. త్వరలో సలార్ ప్రమోషన్స్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ కూడా సలార్ ప్రమోషన్స్ కు ఎక్కువ సమయం కేటాయించనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ తర్వాత సినిమాలకు సంబంధించిన కీలక అప్ డేట్స్ త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంది.

ప్రభాస్ వరుసగా సినిమాలలో నటిస్తూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు. ఇకపై స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో, అనుభవం ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యారని తన సినిమాలు వివాదాల్లో చిక్కుకోవడం కూడా ప్రభాస్ కు అస్సలు నచ్చదని తెలుస్తోంది. హిందీలో ఇప్పటికే ఊహించని స్థాయిలో సత్తా చాటుతున్న ప్రభాస్ తమిళ, మలయాళ భాషల్లో సైతం సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus