Sholey – Mirzapur: సినిమాగా బ్లాక్ బస్టర్ సిరీస్.. సందడి చేయనున్న బ్లాక్‌బస్టర్ సాంగ్
- March 23, 2026 / 08:57 PM ISTByFilmy Focus Desk
ఒకటేమో ఇండియన్ సినిమాలో బ్లాక్‌బస్టర్ అనే పేరుకు అందం తెచ్చే సినిమాలోని పాట. మరొకటేమో వెబ్‌సిరీసుల్లో బ్లాక్‌బస్టర్. ఆ రెండింటినీ కలిపే ప్రయత్నం బాలీవుడ్‌లో జరుగుతుండటమే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ముంబయి. మూడు సీజన్లుగా యువతను విశేషంగా ఆకట్టుకున్న ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఇప్పుడు సినిమా రూపంలో వస్తున్న విషయం తెలిసిందే. ‘మీర్జాపూర్ ది మూవీ’ పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు గుర్మీత్ సింగ్.
Sholey – Mirzapur
ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ, రవికిషన్, షీబా చద్దా తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబరులో విడుదల చేస్తారని సమాచారం. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే ఈ సినిమాలో సోనాల్ చౌహాన్‌పై ఒక ప్రత్యేక గీతంలో స్టెప్పులేస్తోంది అరని. ఆ పాట బాలీవుడ్ బ్లాక్ సినిమా ‘షోలే’లోని మోస్ట్ ‘స్పెషల్’ ‘మెహబూబా మెహబూబా..’ను రీక్రియేట్ చేసి రూపొందిస్తున్నారట.
ఈ పాటలో పంకజ్ త్రిపాఠి, ఇతర ముఖ్య తారాగణంతో కలిసి సోనాల్ స్టెప్పులు వేయనుంది అని సమాచారం. త్వరలోనే ఈ పాట చిత్రీకరణ ఉంటుంది అని చెబుతున్నారు. ఇప్పటికే మూడు సిరీస్‌ల హిట్ బజ్ ఉన్న ఈ సినిమాలో ఇప్పుడు ‘మెహబూబా మెహబూబా’ పాటను కూడా పెడితే బజ్ బీభత్సంగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. దానికితోడు మూడు సిరీస్‌ల్లోని మజా ఒక సినిమాలో ఇస్తాం అని నిర్మాతల్లో ఒకరైన ఫర్హాన్ అక్తర్ అంటున్నారు.
అలా అని, మూడు సిరీస్‌ల్లో చెప్పిన కథను మరోసారి చెప్పడం లేదు అని సమాచారం. ఆ సిరీస్‌లు చూసినవారికి కూడా సినిమా కంటెంట్ కొత్తగా కనిపిస్తుంది అని అంటున్నారు. వెబ్‌సిరీస్‌ల వైబ్‌తో సినిమాగా రూపొందిన ఉదంతాలు ఇప్పటివరకు లేదు. ఇప్పుడు ఈ సినిమా విజయం సాధిస్తే ఇకపై ఇలాంటి ఆలోచనలు మరిన్ని జరుగుతాయి.
















