పాపం ఈ సినిమాలు ఎందుకు చేశారో వారికే తెలియాలి

  • March 3, 2018 / 09:18 AM IST

కొందరు హీరోలు ఒక్కోసారి తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే లేక వేరే అవకాశాలు రాకపోవడం వల్లనో ఒక్కోసారి కొన్ని పిచ్చి సినిమాలు చేస్తుంటారు. అలా నాగశౌర్య కెరీర్ లో “నీ జతలేక” అనే సినిమా వచ్చింది. బాబు మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజయ్యింది. నిజానికి ఎప్పుడో 2013లో షూట్ చేసిన ఈ చిత్రాన్ని 2017లో రిలీజ్ చేశారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా శౌర్యని బలవంతంగా రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మరీ పార్టీశీపేట్ చేయించారు.

ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలోనూ అదే జరుగుతోంది. “పెళ్లిచూపులు” చిత్రానికంటే ముందు అనగా అయిదేళ్ళ క్రితం విజయ్ దేవరకొండ నటించిన “ఏ మంత్రం వేసావే” ఈ నెలలో విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ మొన్న విడుదలైంది. ట్రైలర్ లో విజయ్ దేవరకొండని చూసినవాళ్ళందరూ “ఏంటి ఇలా ఉన్నాడు?” అనుకొన్నారు. ఈ విషయమై ట్విట్టర్ ద్వారా స్పందించిన విజయ్ దేవరకొండ “ఇది నా బ్యాక్ లాగ్ లాంటి సినిమా” అని ట్వీట్ చేశాడు. అలాగే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేదిలేదనే విషయాన్ని కూడా ఇండైరెక్ట్ గా చెప్పాడు. అసలు హీరోల కెరీర్ లు పీక్ స్టేజ్ లో ఉన్న తరుణంలో ఇలాంటి సినిమాలు రిలీజవ్వడం అనేది వారి కెరీర్ లకు మైన్స్ అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus