అన్ని సీరియల్సు.. ‘అమృతం’ సీరియల్ లా ఉండవు..! ఒక కాన్సెప్ట్ ను ఒక్కరోజులోనే తెల్చేయ్యడానికి.! ఈ విషయం ఎందుకు చెప్తున్నానో మీకు అర్ధమయ్యే ఉంటుంది. సీరియల్స్ లో ఒక చిన్న కాన్సెప్ట్ ను సాగదీసి… సాగదీసి… వారాలు, నెలలు.. అవసరమైతే సంవత్సరాల పైనే టెలికాస్ట్ చేస్తుంటారు. ఇలాంటి విషయాలను ‘మత్తు వదలరా’ వంటి సినిమాలో ఎంత కామెడీగా చూపించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదే స్టైల్ లో ‘కుండలి భాగ్యలో’ అనే సీరియల్ టెలికాస్ట్ అవుతుంది.
ఈ సీరియల్ లో హీరోయిన్ కిడ్నాప్ ట్రాక్ ను నెల రోజుల పైనే టెలికాస్ట్ చేశారట. షూటింగ్ కూడా నెల రోజుల వరకూ జరిగిందని తెలుస్తుంది.దాంతో ఈ సీరియల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న హీరోయిన్.. శ్రద్దా ఆర్య ఒకే చీరను నెల రోజుల పాటు కడుతూ వచ్చిందట. ఇక ఈ మధ్యనే తన కిడ్నాప్ ట్రాక్ ముగియడంతో చీరను మార్చిందట శ్రద్దా ఆర్య. ఆ విషయాన్ని తెలుపుతూ ఈమె.. రెండు విడుదలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
లైట్ బ్లూ కలర్ శారీలో శ్రద్దా ఈ వీడియోలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక శ్రద్దా ఆర్య తెలుగులో ‘గొడవ’ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.