రూట్ మార్చిన శ్రద్ధాదాస్!

వెండితెరపై వెలిగిపోవాలని కలలుకనేవారికి షార్ట్ ఫిలిమ్స్ మంచి వేదికయింది. ఈ మార్గం ద్వారా నటీనటులే కాదు డైరక్టర్స్, టెక్నీషియన్స్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. అంతేకాదు సినిమాలో మంచి బ్రేక్ కోసం ఎదురుచూసేవారి పాలిట కూడా దైవంగా మారాయి షార్ట్ ఫిలిమ్స్. మంచి కథ కలిగిన షార్ట్ ఫిలిమ్స్ లో  నటిస్తే చాలు.. ట్రెండింగ్ లోకి వస్తుంది. దీంతో సులువుగా దర్శకనిర్మాతల దృష్టిలో పడి భారీ ఛాన్స్ అందుకుంటున్నారు. గతంలో రాధికా ఆప్టే, తాప్సి, శ్వేతా బసు ప్రసాద్ తదితరులు షార్ట్ ఫిలిమ్స్ చేసి ఎన్నో అవకాశాలు అందుకున్నారు. అదే బాటలో శ్రద్ధాదాస్ వెళుతోంది.

2008లో అల్లరి నరేశ్ ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’తో అడుగుపెట్టిన శ్రద్ద.. ‘అధినేత’, ‘ఆర్య-2’, ‘డార్లింగ్’, ‘నాగవల్లి’, ‘రేయ్’, ‘గరుడవేగ’ వంటి చిత్రాలు చేసింది. అయితే ఈ చిత్రాల్లో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ రోల్స్‌కే పరిమితమైంది. హీరోయిన్ గా మంచి బ్రేక్ రాలేదు.  హిందీలోనూ సినిమాలు చేస్తున్నా.. అక్కడ కూడా సరైన బ్రేక్ సంపాదించలేకపోయింది . అందుకే ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్స్‌ను పక్కనపెట్టి.. షార్ట్ ఫిల్మ్స్ వైపు ఫోకస్ పెట్టింది. ఇప్పటికే  వేశ్యగా ‘శృంగార్ దాన్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తోన్న శ్రద్దాదాస్.. తాజాగా మరో షార్ట్ ఫిల్మ్‌కి ఓకే చెప్పింది. “ప్యూర్ సోల్” అనే ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్‌లో నటించబోతోంది. చిలుకూరి ఆకాశ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ తనకు మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకంతో ఉంది. ఈ షార్ట్ ఫిలిమ్స్ శ్రద్ధ కెరీర్ కి ఎంత మేర ఉపయోగపడతాయో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus