‘ఢీ’ షోలో ప్రదీప్‌, హైపర్‌ ఆదిలకు స్ట్రాంగ్ వార్నింగ్‌.. మేటర్ ఏంటంటే?

‘జబర్దస్త్’ కామెడీ షోలానే ‘ఢీ’ షో కూడా టాప్ ఆర్డర్ లో దూసుకుపోతుంది. ఆల్రెడీ 13 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాయి. ఇప్పుడు 14వ సీజన్‌ జరుగుతుంది. ఈ షో ద్వారా ఇండస్ట్రీలో టాప్‌ కోరియోగ్రాఫర్స్‌గా రాణిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇంత ఘనత కలిగిన ఈ షోలో డ్యాన్స్‌తో పాటు టీమ్‌ లీడర్స్‌, యాకంర్‌, జడ్జెస్‌ వంటి వారు కూడా హైలెట్ అవుతూ ఉంటారు. అలాగే పలు సార్లు వివాదాలు కూడా చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

జూలై 27న ప్రసారం కాబోయే ఎసిసోడ్‌లో కూడా వివాదం చోటు చేసుకున్నట్టు ఓ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. కొరియోగ్రాఫర్‌ రౌండ్‌ కాన్సెప్ట్‌తో ఈ ఎపిసోడ్‌ రూపొందింది. ఈ నేపథ్యంలో కిరణ్ మచ్చా జడ్జి శ్రద్ధా దాస్‌,యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది లతో గొడవకి దిగడం,వార్నింగ్‌ ఇవ్వడం సంచలనంగా మారింది. శ్రద్ధాదాస్‌ కన్నీళ్లు పెట్టుకోవడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. మేటర్ ఏంటంటే.. ఓ పెర్ఫార్మన్స్ నచ్చడంతో జడ్జి అయిన శ్రద్దా దాస్.. లేచి వెళ్లి వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేసి మరీ అభినందించి వారిని ప్రశంసించింది.

ఇది కిరణ్ మచ్చా కి నచ్చలేదు. మా వాళ్ళు కూడా బాగా చేశారు కదా.. అప్పుడెందుకు వచ్చి ఇలా చేయలేదు అంటూ వాదనకు దిగాడు. దీంతో శ్రద్ధాదాస్ .. ‘ఇది సెన్స్ లెస్’ అంటూ ఓ మాట వదిలింది.దీంతో రెచ్చిపోయిన కిరణ్… ‘జడ్జి స్థానంలో ఉన్న మీరు ఇలా చేయడం ఏమీ బాలేదు’ అంటూ ఉండగా ప్రదీప్ సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. అతన్ని కూడా మాట్లాడనివ్వకుండా ఇష్టం వచ్చినట్టు కిరణ్ కామెంట్లు చేశాడు. హైపర్ ఆది వచ్చినప్పుడు ‘నువ్వు ఎటువంటి జోక్ లు వేయకు నీకు అస్సలు మంచిగా ఉండదు’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus