ప్రభాస్ పెళ్లి గురించి ‘సాహో’ బ్యూటీ శ్రద్దా కపూర్ చేసిన కామెంట్?

బాహుబలికి ముందు బాహుబలికి తరువాత అన్నట్లుగా యుంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాహుబలి సినిమాతో ప్రభాస్ కి వరల్డ్ వైడ్ గా పేరు వచ్చింది. ఈ సినిమా తరువాత ప్రభాస్ ఎవరితో సినిమా తీస్తాడా అని అనుకుంటుండగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ తో ‘సాహో’ సినిమా చేస్తూ అందరిని షాకింగ్ కి గురిచేశాడు. కానీ సినిమా మేకింగ్ టీజర్ తో ఈ సినిమా పై ఒక్కసారిగా అందరిలో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి సినిమా ముందునుండి కూడా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటూ తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉండేది. ప్రభాస్ పెళ్లి పైన అనేక రూమర్లు కూడా క్రియేట్ చేసారు. సాహో లో నటిస్తున్న హీరోయిన్ శ్రద్ద కపూర్ ప్రభాస్ గురించి ఒక రేంజులో పొగిడేస్తోంది. హీరో ప్రభాస్ చాలా కూల్ పర్సన్, హి ఇస్ వెరీ నైస్ కోస్టార్ అంటూ ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తేస్తుంది. కొందరు ప్రభాస్ పెళ్లి విషయం పైన అడుగగా ప్రభాస్ పెళ్లి గురించి తనకి ఏమి తెలియదంటూ దాటివేసింది. ఇప్పటికే చర్చనీయాంశం అవుతున్న ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది తెలియాలంటే దీనికి ఆన్సర్ మాత్రం ప్రభాస్ ఏ చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus