‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ కి జోడీగా ‘సాహో’ భామ..?

ప్రస్తుతం ఇండియా వైడ్ “ఆర్ఆర్ఆర్” చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్లు హీరోలు నటిస్తుండడంతో అంచనాలు మరింత బలపడ్డాయి. ఈ చిత్రంలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా చరణ్ కనిపించనున్నారు. ఇక ఎన్టీఆర్ సరసన ముందు బ్రిటన్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకుంది. దీంతో ఎన్టీఆర్ కి జోడిగా ఎవరు అనే దాని పై చర్చ మొదలయ్యింది.

ఇప్పటికే పలువురు పేర్లు వినిపించాయి. ఇందులో పరిణీతి చోప్రా, ఆ తరువాత నిత్యా మీనన్ పేర్లు బాగా వినిపించాయి. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, ప్రభాస్ ‘సాహో’ భామ శ్రద్ధా కపూర్. ఎన్టీఆర్ సరసన శ్రద్ధ అయితే కరెక్టని జక్కన్న భావిస్తున్నాడట. దాదాపు ఈమె ఖరారు అయిపోయినట్టేనని టాక్ నడుస్తుంది. ఎలాగూ ‘సాహో’ షూటింగ్ లో ఈ భామకి సంబందించిన షెడ్యూల్ కూడా పూర్తయ్యిపోతుందట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus