కొత్త అవతారమెత్తిన నాని హీరోయిన్?

  • May 4, 2019 / 01:32 PM IST

నాని హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘జెర్సీ’. ఇటీవల వచ్చిన ఈ చిత్రంలో నాని అద్భుతంగా నటించి శభాష్ అనిపించుకున్నాడు. ఇక నానికి ఏమాత్రం తగ్గకుండా హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ కూడా యాక్టింగ్ ఇరక్కొట్టేసిందనే చెప్పాలి. గ్లామర్ షో చేయకుండా తన పరిమితుల్లోనే అద్భుతమైన హావ భావాల్ని పలికించింది. మధ్యతరగతి గృహిణిగా ఈమె నటనకి ప్రతీ ఒక్కరూ క్లాప్స్ కొట్టాల్సిందే అనడంలో సందేహం లేదు. అయితే ఈమె నర్తించిన ఓ ఐటెం సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో తెగ హల్ చల్ చేస్తుంది.

‘కే13’ అనే కోలీవుడ్ సైన్స్ ఫిక్చన్ థ్రిల్లర్ మూవీలో ఈ అమ్మడు నటించింది. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో శ్రద్దా ఓ ఐటెం సాంగ్ లో కూడా నర్తించింది. ఈ సాంగ్ సినిమాకే హైలెట్ అని కోలీవుడ్ ఆడియన్స్ చెబుతున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే ఈ పాటను యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. భరత్ నీలకంఠన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మే 1 న విడుదలయ్యింది. ఇక ఈ సాంగ్ చూసిన ప్రేక్షకులకి.. ‘జెర్సీ’ లో అంత పద్దతిగా నటించింది’ ఈ భామేనా అనే డౌట్ కలుగక మానదు. అంతే కాదు ఈ చిత్రంలో ఈ అమ్మడు గ్లామర్ డోస్ కూడా పెంచిందని తెలుస్తుంది. దీంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు రావడం ఖాయమంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus