Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

‘బిగ్ బాస్ 9’ సెప్టెంబర్ 7న ప్రారంభం అయ్యింది. 9 మంది సెలబ్రిటీలు 6 మంది కామనర్స తో సహా మొత్తంగా 15 మంది హౌస్ లోకి అడుగుపెట్టారు. ‘బిగ్ బాస్ 9’ ప్రారంభమయ్యి.. 7వ రోజు అవుతుంది. అంటే ఎలిమినేషన్ డేకి వచ్చేసినట్టే అని చెప్పాలి. ఆదివారం రోజు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు అనేది శనివారం రోజునే అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. శని, ఆదివారాల ఎపిసోడ్స్ ను శనివారం రోజునే షూట్ చేస్తారు అనే సంగతి తెలిసిందే.

Bigg Boss 9 Elimination

ఈ వారం నామినేషన్స్ లో సంజన, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్, తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, ఫ్లోరా షైనీ, శ్రష్టి వర్మ వంటి వారు ఉన్నారు. వీరిలో సంజన గల్రాని ఎలిమినేట్ అవుతుంది అని అంతా భావించారు. ఎందుకంటే హౌస్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఈమెపైనే ఎక్కువ నెగిటివిటీ ఉంది. కానీ వోటింగ్ పరంగా ఆమె సేఫ్ అయినట్టు టాక్ వినిపించింది.

ఫైనల్ గా ఫ్లోరా షైనీ, శ్రష్టి వర్మ..లు తక్కువ ఓటింగ్ తో డేంజర్ జోన్లో ఉన్నట్టు కూడా టాక్ వినిపించింది. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఆసక్తి అందరికీ కలిగింది. ఈ నేపథ్యంలో ఫ్లోరా షైనీ సేఫ్ అయినట్టు.. అలాగే శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యింది అనే న్యూస్ కొద్దిసేపటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది.

ఈమెకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ గట్టిగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, అల్లు అర్జున్..ల మధ్య మనస్పర్థలు వచ్చినట్టు.. దీంతో శ్రష్టి వర్మ జానీ మాస్టర్ పై కేసు పెట్టినప్పుడు అల్లు అర్జున్ ఈమెకు అండగా నిలిచినట్లు టాక్ వినిపించింది. దీంతో శ్రష్టి వర్మ హౌస్లోకి అడుగుపెట్టినప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేశారు. కానీ ఎక్కువ ఓట్లు వేసి ఆమెను సేఫ్ చేయలేకపోయారు అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.

పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus