బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఇటీవల వచ్చిన ‘భైరవం’ పర్వాలేదు అనిపించింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు ‘కిష్కింధపురి’ అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘చావు కబురు చల్లగా’ అనే ఫిలాసఫికల్ మూవీ చేసిన కౌశిక్ పెగళ్ళపాటి ఈ చిత్రానికి దర్శకుడు. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు.
సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో 2 రోజుల ముందే ప్రీమియర్స్ కూడా వేశారు. మొదటి షోతోనే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది ఈ సినిమా. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.88 cr |
సీడెడ్ | 0.25 cr |
ఆంధ్ర(టోటల్) | 0.95 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 2.08 cr (షేర్) |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.15 cr |
ఓవర్సీస్ | 0.20cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 2.43 cr (షేర్) |
‘కిష్కింధపురి’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.10.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమాకి రూ.2.43 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.8.57 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ రావడం వల్ల ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి. 2 వ రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. మరి వీకెండ్ ఎంత వరకు రికవరీ చేస్తుందో చూడాలి.