పెళ్ళైన హీరోయిన్ తో నటించడానికి ముందుకు రాని హీరోలు!

  • December 11, 2018 / 11:04 AM IST

ఏదో అక్కినేని సమంతకు అంటే ఫామ్ లో ఉంది కాబట్టి పెళ్లైయ్యాక కూడా ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి కానీ.. అందరికీ అలా సెట్ అవుతుందనుకోవడం ఎంతటి తప్పో ఇప్పుడు శ్రియకు తెలిసొస్తోంది. నాలుగు పదుల వయసు దగ్గర పడుతుండడంతో 36 ఏళ్ళకి తాను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న శ్రియ గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో రీఎంట్రీకి ప్రయత్నిస్తూనే ఉంది. రీసెంట్ గా రజనీకాంత్ “పెట్ట” సినిమాలో సిమ్రాన్ రోల్ కి భీభత్సంగా ప్రయత్నించినా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అలాగే.. తనకు బాగా పరిచయమున్న టాలీవుడ్ టాప్ హీరోలను పలుమార్లు సంప్రదించినప్పటికీ ఎవరూ రెస్పాండ్ అవ్వలేదంట.

అయితే.. ఇప్పుడు అమ్మడు అక్క, వదిన పాత్రలు చేయడానికి కూడా రెడీ అంటోంది. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళైన శ్రియను హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. సో, శ్రియ కాస్త సిగ్గువిడిచి మళ్ళీ ఐటెమ్ సాంగ్స్ చేయడానికి కూడా ప్రిపేర్ అయితే తప్ప ఆమె కెరీర్ మళ్ళీ గాడిలో పడడం కష్టం. మరి శ్రియ కష్టాన్ని కనికరించి ఆమెకు ఎవరైనా ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus