మరో గ్లామరస్ రోల్ లో శ్రియ

  • September 4, 2017 / 01:45 PM IST

రీసెంట్ గా ‘పైసా వసూల్’లో హారిక అనే జర్నలిస్ట్ పాత్రలో అలరించిన శ్రియ.. అప్పుడే మరో సినిమా షూటింగ్ మొదలెట్టింది. “వీరభోగ వసంతరాయులు” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రియ ఓ ఎయిర్ హోస్టెస్ గా నటిస్తోంది. రెగ్యులర్ గర్ల్ క్యారెక్టర్ ప్లే చేస్తేనే తన అందాలతో విశేషంగా ఆకట్టుకొనే శ్రియ.. ఇక ఎయిర్ హోస్టెస్ గా నటిస్తుండడంతో.. ఆ అందాన్ని ద్విగుణీకృతం చేసుకొని.. కుర్రకారుకి పిచ్చేక్కించేందుకు సన్నద్ధమవుతోంది.

నారా రోహిత్, సుధీర్ బాబులు కథానాయకులుగా నటిస్తున్న ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తో ఇంద్రనీల్ అనే 23 ఏళ్ల యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటివరకూ తాను పోషించిన పాత్రల్లోకెల్లా ఈ సినిమాలో క్యారెక్టరే స్ట్రాంగ్ అని, డైరెక్టర్ చెప్పిన విధానం నచ్చి ఈ ప్రోజెక్ట్ ఒప్పుకొన్నానని శ్రియ స్వయంగా చెబుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus