హీరో తల్లిగా శ్రియ!

  • July 5, 2016 / 11:28 AM IST

సినిమా ఇండస్ట్రీలో గతంతో పోలిస్తే హీరోయిన్స్ స్పాన్ చాలా తక్కువ అయిపోయింది. మహా అయితే ఓ దశాబ్ధ కాలం. ఆ తరువాత తమకు హీరోయిన్ వేషాలు రావట్లేదని నటించడం మానేస్తారు. కొన్నాల తరువాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తుంటారు. అయితే హీరోయిన్ త్రిష మాత్రం నేను అప్పుడే ఇండస్ట్రీను వదలను అంటోంది. హీరోయిన్ గా ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ నటి ఇప్పుడు తల్లి పాత్రలకు కూడా సిద్ధమైంది.

గోపాల గోపాల సినిమాలో తల్లి పాత్రలో కనిపించిన ఈ భామ బాలకృష్ణ 100 వ సినిమాలో కూడా తల్లి పాత్రలో కనిపించబోతుంది. అయితే ఇప్పుడు ఏకంగా హీరోకు తల్లి పాత్రలో కనిపించాలనే సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళ హీరో శింబు, ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శింబు త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్ర నడివయసుది కాగా, మిగిలిన రెండు పాత్రలు కొడుకు పాత్రలు. నడివయసు పాత్ర సరసన శ్రియ జంటగా కనిపించనుంది. అంటే ఇద్దరు కొడుకులకు తల్లి పాత్ర అన్నమాట. మొత్తానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని అందరినీ.. ఆశ్చర్యానికి గురి చేస్తోంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus