క్రికెటర్ తో శ్రియ డేటింగ్ చేస్తుందా???

సాధారణంగా సినిమా వాళ్ళు….క్రికెటర్స్….ఇంకా చెప్పాలి అంటే సెలెబ్రెటీస్ లాంటి వాళ్ళకు అఫ్ఫైర్స్, రూమర్స్, గాసీప్స్ ఇలాంటివి చాలా సహజంగా వస్తూ ఉంటాయి అయితే అదే క్రమంలో…వాటన్నింటినీ వారు పెద్దగా పట్టించుకోరు అనే చెప్పాలి. ఇదిలా ఉంటే….టాలీవుడ్ లో బ్యూటీ క్వీన్ గా చాలామణీ అవుతూ ఇప్పటికీ అందాల ఆరబోతకు నో చెప్పని హీరోయిన్ శ్రియ సరన్…..ఇష్టం సినిమాతో 15 సంవత్సరాల క్రితం కెరీర్‌ ప్రారంభించి ఇప్పటికీ కీలక పాత్రలను దక్కించుకుంటోంది.

కెరీర్‌ మొదట్లో ఎలా ఉందో.. ఇప్పటికీ అదే అందాన్ని మెయింటెన్‌ చేస్తోంది. 15 ఏళ్ల కెరీర్ లో ఎవరితోనూ ఎఫైర్‌లు, బ్రేకప్‌లు లేకుండా గడిపేసిన ఈ బ్యూటీ.. ఇన్నాళ్లకు ప్రేమలో పడినట్లు, ఒక స్ట్రార్ క్రికెటర్ తో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి…దానికి తగ్గట్టుగా ఒక రెస్టారెంట్ లో కలిసిన వీరు…బయటకు వస్తూ ఉండగా మీడియా కంటపడటంతో ఈ రూమర్స్ నిజమేనేమో అన్నట్లుగా అనిపిస్తుంది….విషయం ఏమిటంటే…వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావోకు భారత్‌ అంటే ఎంతో ఇష్టం. క్రికెటర్‌గానే కాకుండా సింగర్‌, డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న బ్రావో.. త్వరలో విడుదల కానున్న తుమ్‌బిన్‌-2 సినిమాలో ఓ పాట పాడడం కోసం కొన్ని రోజులుగా ముంబైలోనే ఉంటున్నాడు.

అంతేకాకుండా ఓ టీవీ రియాల్టీ షోలో బ్రావో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే క్రమంలో ఇప్పటికీ…కొద్దిరోజులుగా శ్రియ చరణ్ ఒక ప్రముఖ క్రికెటర్ తో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో….. ఆ క్రికెటర్ ఎవరో కాదు అని…..వెస్టిండిస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో అని ఇటీవల వీరిద్దరూ అంధేరీలోని ఓ రెస్టారెంట్ లో కలుసుకున్న ఫోటోలే అందుకు సాక్ష్యమంటున్నాయి. అయితే దీనిపై ఆ ఇద్దరూ స్పందించక పోవడంతో మీడియాకి మంచి మేత దొరికినట్లు అయ్యింది….మరి చూద్దాం అసలు ఈ వ్యవహారం ఎంతవరకూ వెళుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus