ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో లో కొనసాగుతున్న హీరోయిన్స్ లలో అందరికంటే సీనియర్ శ్రీయ శరన్. అప్పుడెప్పుడో 2001లో వచ్చిన ఇష్టం సినిమాతో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ తరువాత ఏళ్లతరబడి తన హవాను కొనసాగించింది. పోటీగా ఎంత మంది గ్లామర్ బ్యూటీలు వచ్చినా కూడా శ్రియ అందానికి సరైన పోటీని ఇవ్వలేకపోయారు. ఇక ఇప్పుడు అమ్మడు నాలుగు పదుల వయసులోకి వస్తున్నా కూడా గ్లామర్ డోస్ ను ఏ మాత్రం తగ్గించడం లేదు.
ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలతో రచ్చ చేసే ఈ బ్యూటీ ఈ ఏడాదిని కూడా రొమాంటిక్ గా స్టార్ట్ చేసింది. మొన్నటివరకు కాస్త సైలెంట్ గా ఉన్న శ్రీయ ఇటీవల భర్తకు లిప్ లాక్ ఇచ్చిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. భర్తకు మాత్రమె కాకుండా అందరికి ముద్దులు, కౌగిలింతలు పంపుతున్నాను అంటూ కామెంట్ కూడా చేసింది. శ్రీయ సాధారణంగా ఫొటో పోస్ట్ చేస్తేనే ఒక రేంజ్ లో వైరల్ అవుతాయి.
ఇక ఇప్పుడు లిప్ లాక్ ఇవ్వడంతో ఫొటో మరింత వైరల్ అయ్యింది. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే.. RRR సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో కనిపించబోతోంది. అలాగే తమిళ్ రెండు సినిమాలు హిందీలో ఒక సినిమా చేస్తోంది. ఇక గమనం అనే ఒక సినిమాను త్వరలోనే రిలీజ్ చేయనుంది.