వైరల్ అవుతున్న శ్రీయా హాట్ ఫోటోలు..!

  • January 10, 2019 / 11:23 AM IST

టాలీవుడ్ లో దాదాపు సీనియర్ హీరోలందరితోనూ జతకట్టింది శ్రీయ శరన్. అంతే కాకుండా పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,ప్రభాస్, జూ.ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల పక్కన కూడా నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పటికే 37 సంవత్సరాల వయసు మీదపడినప్పటికీ ఇంకా తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది శ్రీయ. ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమాల్లో నటించకపోయినప్పటికీ… మళ్ళీ సీనియర్ హీరోల సరసన నటిస్తూ.. తన పర్సనల్ లైఫ్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది.

గత సంవత్సరం విదేశీ క్రీడాకారుడైన ‘ఆండ్రూ కోశ్చీవ్’ ని శ్రీయ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళైనప్పటికీ గ్లామర్ షో ఏమాత్రం తగ్గించలేదు శ్రీయ. శ్రీయ తాజాగా ఇచ్చిన ఫోటోషూట్లతో హాట్ హాట్ ఫోజులిస్తూ కుర్రకారుని సైతం హీటెక్కిస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఈజిప్టులోని బార్సిలోనా దీవుల్లోజరుపుకుంది. తాజాగా ఈ ఫొటలను తన ఇన్స్టాగ్రామ్లో లో పోస్ట్ చేసింది. ఇక ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ లో అతిధి పాత్రలో కనిపించిన శ్రీయ తరువాత విక్టరీ వెంకటేష్ సరసన ‘వెంకీ మామ’ చిత్రంలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ లో `తడ్కా` అనే చిత్రంలో నటిస్తోంది. దీనితో పాటు అరవింద స్వామి-సందీప్ కిషన్ ల `నరగసూరన్` అనే చిత్రంలోనూ నటిస్తుంది. ఇంత ఏజ్ వచ్చినా.. అందులోనూ ఇంత పోటీలో కూడా అవకాశాలు దక్కించుకోవడం సామాన్య విషయం కాదు. ఆ విషయంలో శ్రీయ గ్రేట్ అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus