నా ప్రైవేట్ లైఫ్ గురించి మీకు ఎందుకు: శ్రియా శరణ్

సుదీర్ఘ కెరీర్‌ను పూర్తిచేసుకున్న శ్రియ నేటికీ నటన పట్ల మక్కువను ప్రదర్శిస్తూనే ఉంది. కొందరు నాయికల కోవలో పెళ్లి తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తోంది. తెలుగు, హిందీ, తమిళం వంటి ఏ భాషల సినిమాలలో అవకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కొందరు కథానాయికలు మహిళా ప్రాధాన్య చిత్రాల ద్వారా ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న నేపథ్యంలో తాను కూడా అలాంటి గుర్తింపును సంపాదించుకోవాలని ఆమె భావిస్తోందట. తెలుగులో గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్‌, గాయత్రి, వీరభోగ వసంతరాయలు తదితర చిత్రాల తర్వాత ఎన్‌.టి.ఆర్‌. కథానాయకుడు చిత్రంలో ప్రభ పాత్రలో సందడి చేసిన శ్రీయకు తెలుగులో ఇప్పుడు సరైన ఆఫర్స్ లేవు.

అయితే.. ఈమధ్య ఒక ప్రైవేట్ ఈవెంట్ కు హాజరైన శ్రీయను ఆమె రాబోయే సినిమాల గురించి మాత్రమే కాకుండా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందని ప్రశ్నించగా.. “మీకు నా పర్సనల్ లైఫ్ గురించి మీకు ఎందుకు?, నా సినిమాల గురించి మాత్రమే అడగండి.. ఆ ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం చెబుతాను” అని కాస్త ఘాటుగానే స్పందించింది శ్రీయ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus