మరోసారి వెంకీతో జతకట్టనున్న శ్రీయ

  • December 13, 2018 / 09:18 AM IST

వెంకీ – చేయ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న క్రేజీ మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.సురేష్ బాబు నిర్మిస్తున్నారు. నవంబర్ లోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. నాగ చైతన్య పై కొన్ని కీలక సన్నీవేశాల్ని చిత్రీకరించినట్టు సమాచారం. తాజాగా వెంకటేష్ కూడా ఈ చిత్ర షూటింగ్లో జాయిన్ అయ్యారట.

ఇక ఈ చిత్రంలో చైతూ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుందట. గతంలో చైతూ – రకుల్ కాంబినేషన్లో వచ్చిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఈ జంట కలిసి నటిస్తుండడం విశేషం. అయితే వెంకటేష్ సరసన మొదట్లో రజినీ కాంత్ ‘కాలా’ చిత్ర హీరోయిన్ హుమా ఖురేషి ను అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆమె తప్పుకుందట. ఇప్పుడు శ్రియను ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. గతంలో ‘సుభాష్ చంద్రబోస్’ ‘గోపాల గోపాల’ చిత్రాలలో వెంకటేష్ తో కలిసి నటించింది శ్రీయ. అంతే కాదు వెంకీ సూపర్ హిట్ చిత్రం ‘తులసి’ చిత్రంలో కూడా వెంకీతో కలిసి ఒక సాంగ్ లో స్టెప్పులేసింది. ఇప్పుడు మరోసారి వెంకీకి హీరోయిన్ గా నటిస్తుంది. అంటే చైతూ కి అత్త క్యారెక్టర్ అనమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus