మరో సారి తల్లి కానున్న శ్రియ

పదిహేనేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో తారగా వెలుగుతున్ననటి శ్రియ. నియమాలు అంటూ గిరి గీసుకుని కూర్చోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది. అగ్రహీరోల పక్కన నటించడంతో పాటు.. యంగ్ హీరోల పక్కన ఆడి పాడింది. ఠాగూర్, శివాజీ, మనం వంటి గొప్ప విజయాలను అందుకుంది. స్పెషల్ సాంగ్లో నర్తించింది. గోపాల గోపాల సినిమాలో వెంకటేష్ భార్యగా, పిల్లలకు తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరోసారి తల్లి పాత్ర పోషించనుంది.

నటసింహ నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో శ్రియ శాతకర్ణికి భార్యగా, రాణిగా, ఇద్దరి పిల్లల తల్లిగా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మొరాకోలో యుద్ధ సన్నివేశాలను షూట్ చేయగా.. చిలకూర్ బాలాజీ టెంపుల్ సమీపంలో పోరాట సన్ని వేషాలను చిత్రీకరించారు.

మూడవ షెడ్యూల్ కొన్నిరోజుల్లో మొదలు కానుంది. ఇందు కోసం ప్రత్యేకంగా  రాజ దర్బార్ సెట్ వేశారు. ఈ షూటింగ్ లో శ్రియ పాల్గొననుంది. రాణి ధరించే డ్రస్సుల డిజైన్ చేయడంలో ఫ్యాషన్ డిజైనర్లు బిజీగా ఉన్నారు. బాలయ్య సినీ ప్రయాణంలో ఈ సినిమా ఒక మైలు రాయిగా నిలిచిపోవాలని డైరక్టర్ క్రిష్ బృందం శ్రమిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus