శ్రియ షాపింగ్ తన పెళ్లి కోసం కాదు

  • February 7, 2018 / 09:42 AM IST

నిన్న ఉదయం నుంచి ‘శ్రియ పెళ్లి’ అంటూ సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. ఎవరో రష్యన్ యువకుడ్ని శ్రియ లవ్ చేసిందట, అతడ్నే మార్చిలో పెళ్లి చేసుకోబోతోందట అంటూ వెబ్ సైట్లు మాత్రమే కాదు విశేషమైన రెప్యుటేషన్ కలిగిన ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కూడా కథనాలు ప్రచురించడంతో అందరూ అది నిజమే అనుకొన్నారు. అందులోనూ శ్రియ ఈ వార్తలపై స్పందించకపోవడం, ఆమె వయసు కూడా 32కి చేరువవ్వడంతో పెళ్లి చేసేసుకొంటుందేమో అని పరిశ్రమకి చెందిన వ్యక్తులు కూడా నమ్మేశారు. అయితే.. కాస్త లేట్ గా స్పందించిన శ్రియ తల్లి నిరజ “ఆ కథనాలన్నీ కల్పితాలే, నా కూతురు ప్రస్తుతం తెలుగు-తమిళ ప్రొజెక్ట్స్ తో చాలా బిజీగా ఉంది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొనే ఆలోచన ఆమెకు లేదు. పైగా.. రష్యన్ ప్రేమికుడు అంటూ ఏవేవో రాస్తున్నారు. వాటిలో నిజం లేదు.

అసలు శ్రియ డిజైనర్ డ్రెస్, జ్యూవెలరీ ఆర్డర్ చేసింది గుజరాత్ లో జరగనున్న తన స్నేహితురాలి పెళ్ళికి అటెండ్ అవ్వడం కోసం. దానికి కొందరు ఇలా కథనాలు రాసేయడం ఎంతవరకు సమంజసం” అంటూ శ్రియ మదర్ నిరజ సీరియస్ అవ్వడంతో… అప్పటివరకూ శ్రేయకు పెళ్ళేంటీ అంటూ ఢీలాపడిన ఆమె వీరాభిమానులు ఒక్కసారిగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. అయినా.. ఏమాటకామాటే చెప్పుకోవాలి కానీ శ్రియకి నిజంగానే పెళ్లి చేసుకోవాల్సిన ఏజ్ వచ్చేసిందండీ. యోగా, ఎక్సర్ సైజ్ చేస్తూ గ్లామర్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి సరిపోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus