మీడియాపై విరుచుకు పడిన శృతి హాసన్

  • March 1, 2018 / 09:20 AM IST

విశ్వనటుడు పెద్ద కుమార్తె శృతి హాసన్ తనకంటూ ఓ గుర్తింపు సాధించుకుంది. అపజయాలు పలకరించినప్పుడు.. అనేక సినిమాలు ఒప్పుకున్న ఈ బ్యూటీ, విజయాలు వరిస్తున్న సమయంలో నటనకు దూరంగా ఉంటోంది. కారణం అడిగితే మాత్రం కస్సుబుస్సుమంటోంది. రీసెంట్ గా ఇదే ప్రశ్న అడిగిన మీడియా వారిపై విరుచుకు పడింది. “నేను సినిమాలకు సైన్‌ చేయలేదంటే దానికి బోలెడు కారణాలుంటాయి. నటన తప్ప నాకేమీ పని ఉండదా, రాదా?” అంటూ ఎదురు ప్రశ్నించింది.

దీంతో సదరు విలేఖరికి ఏమిచేయాలో తెలియక సైలెంట్ గా చూస్తూ ఉండిపోయారు. అంతటితో శృతి ఆగిపోలేదు. ” ఏ సమయంలో ఏది చేయాలో నాకు బాగా తెలుసు. పెళ్ళి కూడా నా ఇష్టప్రకారమే జరుగుతుంది. ఈ విషయంలో ఎవరూ ఎలాంటి ఊహాగానాలు చేయనక్కర్లేదు” అంటూ అడగని ప్రశ్నకి కూడా సమాధానమిచ్చింది. ముంబైలో జరిగిన ఈ సంఘటనను అక్కడి మీడియా వారు బ్రేకింగ్ న్యూస్ గా ప్రసారం చేశారు. అలాగే శృతి నటన కాకుండా ఏ పనిలో బిజీగా ఉందో చెబితే బాగుండేదని విమర్శలు చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus