ఆ విషయంలో నేను వరస్ట్ అంటోన్న శృతి!
- February 17, 2021 / 12:25 PM ISTByFilmy Focus
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి శృతిహాసన్ ఆ తరువాత బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. అక్కడ కొన్ని చిత్రాలలో నటించినప్పటికీ సరైన సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయింది. దీంతో తిరిగి టాలీవుడ్ కి వచ్చి.. ఇక్కడే సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన ‘క్రాక్’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. సినిమాలో శృతి పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈమె నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
అలానే శృతి చేతిలో ‘సలార్’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ఉంది. ఇలా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా.. తన అలవాట్లు, వ్యక్తిగత విషయాల గురించి ఎప్పటికప్పుడు బయటపెట్టే శృతి.. ఈసారి మరో కొత్త విషయాన్ని వెల్లడించింది. డ్రైవింగ్ లో తనంత వరస్ట్ డ్రైవర్ ప్రపంచంలోనే ఎవరూ ఉండరని.. అంత చెత్తగా డ్రైవ్ చేస్తానని చెప్పింది. అందుకే అత్యవసరమైతే తప్ప కారు నడపనని.. ఒకవేళ సరదాగా డ్రైవ్ చేయాలనిపిస్తే మాత్రం తన దగ్గర ఉన్న రెడ్ కలర్ రేంజ్ రోవర్ ను డ్రైవ్ చేయడానికి ఇష్టపడతానని చెప్పింది.

అలానే ఎలక్ట్రిక్ కార్లు, ఇంధన కార్లలో తనను సెలెక్ట్ చేసుకోమంటే.. ఖచ్చితంగా ఎలక్ట్రిక్ కారునే ఎంచుకుంటానని.. ఇందులో మరో ఆలోచనకు తావులేదని చెప్పింది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల బట్టి చూసుకుంటే.. పర్యావరణ హితం కోసం అందరూ ఎలక్ట్రిక్ కార్లనే వాడాలని చెప్పింది. త్వరలోనే తను ఎలక్ట్రిక్ కారు సెగ్మెంట్ వైపు మారతానని చెప్పుకొచ్చింది.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?












