Shruti Haasan: ప్రియుడి గురించి శృతి హాసన్ ఎమోషనల్ పోస్ట్..!

  • January 25, 2023 / 10:37 AM IST

ప్రేమ,పెళ్లి వ్యవహారాలతో సినీ కెరీర్ ను నిర్లక్ష్యం చేసి.. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైంది శృతి హాసన్. అయితే ‘క్రాక్’ తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’.. ఇటీవల వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో కూడా హిట్లు కొట్టి మంచి ఫామ్లో ఉంది. ప్రస్తుతం ఈమె ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్‌’ లో నటిస్తుంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అని అంతా భావిస్తున్నారు.

ఇది కనుక హిట్ అయితే శృతి హాసన్ మళ్ళీ టాప్ ఆర్డర్ లో నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. శృతి హాసన్ మళ్ళీ శాంతాను హజారికా అనే వ్యక్తితో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతనితో డేటింగ్ లో ఉంది శృతి హాసన్! టైం దొరికిన ప్రతీసారి ఇద్దరూ కలిసి టూర్లు, రెస్టారెంట్ ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే పెళ్లి ఎప్పుడు? అని ఈ జంటను ప్రశ్నిస్తే.. అందుకు మాత్రం సమాధానం వినిపించడం లేదు.

తన తండ్రి బాటలోనే సహజీవనానికే శృతి హాసన్ మక్కువ చూపిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రియుడితో కలిసి దిగిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసిన శృతి హాసన్ పలు ఎమోషనల్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా నిలిచింది.‘‘ఈ ప్రపంచంలో నీకంటే కూడా… నన్ను సంతోషంగా చూసుకునేవారు ఎవ్వరూ లేరు’’ అంటూ ఈమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం శృతి పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus