టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ మెగా హీరోలతో నటించిన సినిమాలన్నీ సక్సెస్ గా నిలవడం హాట్ టాపిక్ గా నిలుస్తోంది. పవన్ కళ్యాణ్ శృతి హాసన్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ శృతి హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన రేసుగుర్రం సినిమా కూడా సక్సెస్ సాధించింది.
రామ్ చరణ్ శృతి హాసన్ కాంబినేషన్ లో ఎవడు సినిమా తెరకెక్కగా కమర్షియల్ గా సక్సెస్ సాధించడం గమనార్హం. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి, శృతి హాసన్ కలిసి నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. మెగా హీరోలకు శృతి హాసన్ లక్కీ హీరోయిన్ గా మారిపోయిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.శృతి హాసన్ ఒక్కో సినిమాకు 2.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
శృతి హాసన్ రోల్ తో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాలైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సలార్ సినిమాలో శృతి హాసన్ కీలక పాత్ర పోషిస్తుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. శృతి హాసన్ అటు క్లాస్ రోల్స్ లో ఇటు మాస్ రోల్స్ లో అద్భుతంగా నటించి మెప్పించడం గమనార్హం.
శృతి హాసన్ కు వరుస విజయాల వల్ల ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. 36 సంవత్సరాల వయస్సులో కూడా యంగ్ గా కనిపిస్తూ నటిగా శృతి హాసన్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నారు. శృతి హాసన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా తక్కువేం కాదు.