టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడే సెటిల్ అవ్వాలనుకుంది. కానీ ఆమె ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి టాలీవుడ్ లోనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. శృతిహాసన్ జీవితంలో చాలా మలుపులు ఉన్నాయి. ప్రేమ, బ్రేకప్, సినిమాలు ఇలా వైవిధ్యంతో కూడిన జీవితం ఆమెది. లవ్ బ్రేకప్ కావడంతో దాని నుండి బయటపడడానికి ఆమె సంగీతాన్ని, మళ్లీ సినిమాలను ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఆమె సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు శృతి. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ ఏడాదిలో మీరు పెళ్లి చేసుకోబోతున్నారా..? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ఆమె ఏమాత్రం తడుముకోకుండా బదులిచ్చింది. తనపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్ అని కొట్టి పారేసింది. కొందరు ‘మీరు ముక్కుకు సర్జరీ చేయించుకున్నారా..?’ అని ప్రశ్నించగా.. ఏడేళ్ల క్రితం నాటి సంఘటన గురించి ఇప్పుడు అవసరమా అంటూ పరోక్షంగా మండిపడింది.
‘క్రాక్’ సినిమా ప్రమోషన్స్ లో ఎందుకు పాల్గొనడం లేదని అడగగా.. బిజీగా ఉండడం వలన కుదరలేదని చెప్పింది. మీ మాజీ ప్రియుడు మైకేల్ గుర్తుకు వస్తే అసహ్యం వేస్తుందా..? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. గట్టి కౌంటర్ ఇచ్చింది శృతి. ”నువ్వు చాలా చెడ్డవాడిలా ఉన్నావ్.. నా జీవితంలో నేనెవరినీ అసహ్యించుకోను. అలా జరగదు. కానీ ఆ విషయంలో కాస్త బాధపడతాను” అంటూ చెప్పుకొచ్చింది.