శభాష్ నాయుడు సినిమా ఆగిపోవడం వెనుక వింత నిజాలు

  • July 15, 2019 / 11:50 AM IST

పూజా కార్యక్రమాల దగ్గర కొన్ని సినిమాలు ఆగిపోతుంటాయి. షూటింగ్ మొదలై డబ్బుల్లేక మరికొన్ని సినిమాలు ఆగిపోతుంటాయి. కానీ.. షూటింగ్ మొదలయ్యాక ఎవరికీ మంచి జరగడం లేదని సినిమా ఆగిపోవడం అనేది బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా. ఆ కారణంగా ఆగిపోయిన మొట్టమొదటి సినిమాగా చరిత్రలో నిలిచిపోతుంది “శభాష్ నాయుడు”. కమల్ హాసన్, బ్రహ్మానందం, శ్రుతిహాసన్ ప్రధాన పాత్రలో రూపొందాల్సిన ఈ చిత్రం ఘనంగా తెలుగు-తమిళ భాషల్లో ప్రారంభోత్సవం జరుపుకొన్న తర్వాత కొన్నాళ్లు షూటింగ్ కూడా జరుపుకోంది.

అయితే.. ఆఫీస్ లో మెట్లు దిగుతూ కమల్ హాసన్ జారిపడి కాలు విరగొట్టుకోవడంతో షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం, శ్రుతిహాసన్ తన లాంగ్ డిస్టేంస్ రిలేషన్ షిప్ ను సీరియస్ గా తీసుకొని అందులో ఫుల్లుగా మునిగిపోవడం వంటి కారణాలుగా సినిమా మొత్తానికి అటకెక్కేసింది. అయితే.. ఇప్పుడు “శభాష్ నాయుడు” చిత్రాన్ని మొత్తానికి ఆపేసినట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రొజెక్ట్ మొదలెట్టిన తర్వాత కమల్ హాసన్, శ్రుతిహాసన్ లకు మాత్రమే కాక బ్రహ్మానందంకు కూడా హెల్త్ కానీ పర్సనల్ లైఫ్ కానీ బాగోకపోవడంతో.. సినిమా ఎవరికీ అచ్చిరావడం లేదనే సెంటిమెంట్ తో సినిమాను ఆపేశారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus