Shruti Haasan, Prabhas: ప్రభాస్ అలా బిహేవ్ చేస్తారంటున్న శృతి!

  • January 24, 2022 / 08:19 AM IST

సాధారణంగా స్టార్ హీరోలకు జోడీగా నటిస్తున్న హీరోయిన్లు సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా నటించడానికి ఓకే చెప్పరు. అయితే శృతి హాసన్ మాత్రం ఒకవైపు ప్రభాస్ కు జోడీగా పాన్ ఇండియా సినిమా అయిన సలార్ లో నటిస్తూనే మరోవైపు బాలయ్య, చిరంజీవిలకు జోడీగా నటిస్తున్నారు. ఇతర ఇండస్ట్రీలలో కూడా శృతి హాసన్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. సలార్ మూవీలో శృతి జర్నలిస్ట్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ తక్కువగా మాట్లాడతారని అందరూ చెబుతారని కానీ ప్రభాస్ గురించి ఆ వార్త నిజం కాదని అన్నారు. సలార్ మూవీ సెట్స్ లో తాను, ప్రభాస్ కలిసి చాలా విషయాలు మాట్లాడుకుంటామని శృతి హాసన్ అన్నారు. ప్రభాస్ మంచి మాటకారి అంటూ శృతి హాసన్ ఎవరికీ తెలియని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పాలని అడిగిన ప్రశ్నకు ఇతరులకు తెలియని విషయాలు నాకు మాత్రం ఎలా తెలుస్తాయంటూ శృతి హాసన్ ఈ విధంగా బదులిచ్చారు.

మరోవైపు 2021 సంవత్సరం శృతి హాసన్ కు బాగానే కలిసొచ్చింది. ఈ ఏడాది కూడా శృతి హాసన్ వరుస విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. ఈ ఏడాది శృతి హాసన్ నటించిన సలార్ మూవీ రిలీజ్ కానుంది. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఆ సినిమా కూడా ఈ ఏడాదే రిలీజయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. బాలయ్య శృతి హాసన్ కాంబో మూవీ కొరకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూతున్నారు.

అన్ స్టాపబుల్ సీజన్1 ను సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసిన బాలయ్య ఈ సీజన్ కు మాత్రమే పరిమితం కానున్నారని సమాచారం. అన్ స్టాపబుల్ సీజన్2 కు చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus