కమల్ హాసన్ తనయ.. శృతి హాసన్ తాజాగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా రాణిస్తున్న శృతి హాసన్.. ఇద్దరు అగ్ర హీరోలతో నటించిన చిత్రాలు రెండు రోజుల వ్యవధిలో రిలీజ్ కావడం ఇదే తొలిసారి. వీరసింహారెడ్డి మిక్స్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో ఈరోజు వాల్తేరు వీరయ్య చిత్రం విడుదలైంది. వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన శృతిహాసన్.. ఆ మరునాడే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాత్రం పార్టటిసిపేట్ చేయలేకపోయింది.
అనారోగ్య కారణాల వల్ల తాను రాలేకపోతున్నానని ఈవెంట్‌కు ముందే సోషల్ మీడియాలో పోస్టు చేసింది శృతి హాసన్. ఎవరికీ అనుమానం రాకుండా ఇలా చేసిందంటూ పెద్ద డిస్కషన్ నడిచింది. అయితే, శృతి హాసన్ వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు రాకపోవడంపై సోషల్ మీడియాలో శృతి హాసన్‌పై ట్రోల్స్ వచ్చాయి. చాలా మంది అభిమానులు ఓ ఫంక్షన్‌కు వచ్చి మరో ఫంక్షన్‌కు రాకపోవడం ఏంటని ప్రశ్నలు కురిపించారు. ఈ క్రమంలో మీడియాలో కూడా శృతి హాసన్ అనారోగ్య కారణాలతోనే రాలేదని వార్తలు వచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవి సైతం ఫంక్షన్లో ఈ మేరకు స్పందించారు. అనారోగ్య కారణాలతోనే శృతి రాలేకపోయిందని క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్. శృతికి మానసిక ఆరోగ్య సమస్యలున్నాయనే వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఈ హీరోయిన్ స్పందించింది. మీకు సమస్య ఉంటే.. చూపించుకోండి.. ట్విట్టర్లో శృతి ఓ పోస్ట్‌ని షేర్ చేసింది. దీంతోపాటు కొన్ని స్క్రీన్ షాట్లను కూడా ఉంచింది. సరే.. ఇక్కడ విషయం ఉంది.. ఇది తప్పుడు సమాచారం.. అలాంటి విషయాలపై నాటకీయత కలిపి రాయడం వల్ల జనాలు భయాందోళనలకు లోనవుతారు..
మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటానికి ఇంకా భయపడతారు.. నా విషయంలో అలా భయపెట్టడానికి ప్రయత్నించారు.. అంటూ కామెంట్ చేసింది శృతి హాసన్. కానీ ఇది వర్కౌట్ కాలేదని, తాను ఎప్పుడూ మాససిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేసింది. తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని చెప్పింది. మీరు చాలా బాగా ప్రయత్నించారంటూ సెటైర్లు వేసింది. మంచి థెరఫిస్ట్తో మాట్లాడి చూపించుకోండంటూ పోస్టులో పేర్కొంది శృతి హాసన్.