ఆ హీరోతో త్రిష పెళ్లి ఫిక్స్ అయినట్లేనా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్లు కెరీర్ సాగించిన త్రిష ఆ తరువాత కోలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ఇప్పటికీ కూడా వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతోంది. గతంలో నిర్మాత వరుణ్‌ మణియన్‌‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకొని, తీరా పెళ్లి మాత్రం త్రిష.. నిర్మాత వరుణ్‌ మణియన్‌‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకొని, తీరా పెళ్లి సమయం వచ్చేసరికి నో చెప్పేసింది. ఆ తరువాత కొంతకాలం పాటు పెళ్లి విషయాన్ని పక్కన పెట్టేసింది. ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా ఈ బ్యూటీ కోలీవుడ్ వివాదాస్పద హీరో శింబుతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్లు కామనే గానీ కోలీవుడ్ మీడియా త్రిష,శింబుల పెళ్లికి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ముహూర్తం పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు ప్రచురిస్తోంది. రీసెంట్ గా త్రిష తన సోషల్ మీడియా అకౌంట్ లో ఉన్న ఫోటోలన్నీ తొలగించి ఫ్రెష్ రిలేషన్షిప్ మొదలుపెడుతున్నట్లు చెప్పింది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇటీవల శింబు తండ్రి, టి.రాజేందర్ ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలెక్షన్స్ కి సంబంధించిన ఈ ప్రెస్ మీట్ లో మీడియా నుండి శింబు, త్రిషల పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

అయితే రాజేందర్ వీటికి సమాధానం చెప్పకుండా ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండిపోయారు. ఆ తరువాత టాపిక్ మార్చేసి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. ఈ వార్తలను కొట్టిపారేయకుండా స్కిప్ చేయడంతో ఏదో జరుగుతుందనే సందేహాలు మొదలయ్యాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో చూడాలి. త్రిష- శింబు జోడీగా ‘విన్నైతాండి వరువాయ’ ( ఏమాయ చేశామే తమిళ్‌ వెర్షన్ ‌), అలై చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus