తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జులతో కలిసి నటించి ఎన్నో హిట్స్ అందుకున్న సిమ్రాన్.. పెళ్లి తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత విశాల్ నటించిన ‘తుప్పరివాళన్’ సినిమాలో నటనతో అదరగొట్టింది. రీసెంట్ గా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధృవ నక్షత్రం ’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. సీనియర్ హీరోయిన్స్ ఇలా క్యారక్టర్ ఆర్టిస్టుగా.. హీరోయిన్స్ కి తల్లిగానో, అక్కగానో, వదినగానో నటించడం ఇప్పుడు సాధారణం అయింది. సిమ్రాన్ కి ఆలా నటించడం బోర్ అయిందేమో తెలియదు గానీ, ఒక అడుగు ముందుకు వేసి విలన్ రోల్ చేయడానికి సిద్ధమైంది. ఆ విషయాన్నీ సిమ్రాన్ మీడియాకి వెల్లడించింది. “శివకార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమాలో నేను నెగిటివ్ పాత్రలో నటించబోతున్నాను.
ఇందులో నా పాత్ర చాలా విభిన్నమైనది. కొత్త కోణంలో నన్ను చూడబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మాస్ ప్రజలకు నాచే అన్ని అంశాలు ఇందులో ఉండబోతున్నాయి. సినిమా కమర్షియల్ హిట్ సాధిస్తుంది” అని వివరించింది. కోలీవుడ్, టాలీవుడ్ లో హీరోగా అవకాశాలు తగ్గిన సీనియర్ హీరోలు విలన్స్ గా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అలాగే ఈ సీనియర్ హీరోయిన్ నెగిటివ్ రోల్లో ఎంతమేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.