Simran: ఆ సాంగ్ చేయకపోయి ఉంటే హిట్ సినిమా కోల్పోయేదాన్ని!

Advertisement

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సిమ్రాన్ ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు. ఇలా వరుస సినిమాలలో అగ్ర హీరోలు అందరికి సరసన నటించి మెప్పించిన సిమ్రాన్ ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి దూరమయ్యారు. సిమ్రాన్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

గత కొద్ది రోజుల క్రితం తన చెల్లి మరణం గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ అయినా సిమ్రాన్ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే గతంలో ఈమె నటించిన ఐటమ్ సాంగ్స్ గురించి చర్చలు మొదలయ్యాయి.ఈమె స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సౌందర్య చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించి సందడి చేశారు.

ఇకపోతే అదే సమయంలోనే కోలీవుడ్ నటుడు విజయ్ తో కలిసి కూడా ఈమె (Simran) ఒక స్పెషల్ సాంగ్ చేశారు. ఇలా హీరో విజయ్ తో కలిసి స్పెషల్ సాంగ్ చేసే సమయంలో చాలామంది ఈమెపై విమర్శలు చేశారు. తాజాగా ఈ ఐటమ్ సాంగ్ గురించి సిమ్రాన్ తన అభిప్రాయాలను తెలియజేశారు. ఇది తన జీవితమని, నిర్ణయాలు కూడా తన ఇష్టమేనని తెలియజేశారు. ఆరోజు నేను ఈ సాంగ్ లో చేస్తుంటే చాలామంది చేయొద్దు అని తనకు సలహాలు ఇచ్చారు.

ఈ విధంగా వారి సలహా మేరకు తాను ఈ సినిమాలో కనుక నటించకపోయి ఉంటే తాను ఒక సూపర్ హిట్ సినిమాని కోల్పోయే దాన్ని అంటూ ఈ సందర్భంగా సిమ్రాన్ విజయ్ తో కలిసి నటించిన ఐటమ్ సాంగ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక గత కొంతకాలంగా సినిమాలకు దూరమైనటువంటి సిమ్రాన్ తిరిగి ఎలాంటి సినిమాలలో నటించలేదు. అయితే ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus