Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

సింగీతం శ్రీనివాసరావు.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘పుష్పక విమానం’ ‘భైరవద్వీపం’ ‘ఆదిత్య 369’ వంటి ఎన్నో టైమ్ లెస్ క్లాసిక్ సినిమాలు అందించారు. విజినరీ డైరెక్టర్ అని కూడా అనొచ్చు. అలాంటి గొప్ప దర్శకుడు 94 ఏళ్ళ వయసులో కూడా ఓ సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదు. అదే ‘సింగ్ గీతం'(Sing Geetham). నాగ్ అశ్విన్ నిర్మాణ సారధ్యంలో ‘వైజయంతీ మూవీస్’ సంస్థ పై ఈ చిత్రం రూపొందింది.

Sing Geetham

జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద సొ సొ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  1.35 cr
సీడెడ్ 0.22 cr
ఆంధ్ర(టోటల్) 0.70 cr
ఏపీ +తెలంగాణ(టోటల్) 2.27 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.93 cr
వరల్డ్ వైడ్ టోటల్ 3.2 cr

‘సింగ్ గీతం’ చిత్రాన్ని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు మేకర్స్. అయితే బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కోసం రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.2.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.  2వ వీకెండ్ ‘మా ఇంటి బంగారం’ ‘పెద్ది’ సినిమాలతో పోటీబడి నిలబడితే.. కొంతవరకు వెనకేసుకోవచ్చు. మరి ఆ అవకాశాన్ని ‘సింగ్ గీతం’ ఎంత వరకు వాడుకుంటుందో చూడాలి.

రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus