‘సింగ్ గీతం’ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు సింగీతంపై అలాగే చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ లిస్టులో తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్(NTR) కూడా చేరాడు.’సింగ్ గీతం’ చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఈ సినిమాపై ట్విట్టర్లో తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు ఎన్టీఆర్.
అతని ట్వీట్ ను గమనిస్తే.. ” ‘సింగ్ గీతం’.. హృదయాన్ని హత్తుకునే ఓ అందమైన సినిమా.94 ఏళ్ల వయసులో కూడా లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు తన సృజనాత్మకతను, క్రియేటివిటీని వెండితెరపై ఆవిష్కరించిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. దేవి.. ‘నువ్వు ప్రతి సీన్‌లోనూ మ్యాజిక్ క్రియేట్ చేశావ్, ఈ సినిమాకి నువ్వు అందించిన సంగీతం అద్బుతం.సింగీతం గారి 40 ఏళ్ల కలని నిజం చేయడం అనేది దేవుడిచ్చిన వరంతో సమానం.
వైజయంతీ సంస్థ ఈ సినిమా ద్వారా సింగీతం గారికి వారు అందించిన ట్రిబ్యూట్ చాలా గొప్పది.సింగీతం గారి సినిమాలు ఎప్పుడూ మనల్ని సర్ప్రైజ్ చేస్తుంటాయి. ‘సింగ్ గీతం’ లో కూడా మంచి సర్ప్రైజ్ ఉంది. సాధారణంగా విడుదలకు ముందే ట్రైలర్ వస్తుంది, కానీ ఈ సినిమాకు సినిమా విడుదలైన తర్వాత ట్రైలర్ రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకులకు అందించడం అనేది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అందరూ ఈ సినిమాని థియేటర్లలో మిస్ కాకుండా చూడండి” అంటూ పేర్కొన్నాడు జూనియర్ ఎన్టీఆర్.
#SingGeetham is a beautiful film that touched my heart. Legendary Singeetham Srinivasarao garu at 94 delivering creativity and wisdom like only he can is deeply inspiring to witness.https://t.co/V3I1C0jAth @ThisIsDSP, you nailed it throughout! You brought magic to every…
— Jr NTR (@tarak9999) June 15, 2026