Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Focus » Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

  • October 4, 2026 / 07:39 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

ఇండియన్ సినీ పరిశ్రమలో ఎంతో మంది దర్శకులు వచ్చారు, వెళ్లారు. వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళు ఎంత మంది ఉన్నా.. తమ మార్క్ తో కల్ట్ ఫ్యాన్స్ ను క్రియేట్ చేసుకున్న వారు మాత్రం కొందరే ఉంటారు. వాళ్ళ లిస్ట్ తీస్తే.. టాప్ ఆర్డర్లో ఉండే దర్శకుల్లో సింగీతం శ్రీనివాస్(Singeetam Srinivasa Rao) పేరు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ ఒక రెగ్యులర్ ఫార్మాట్ కు ఆయన స్టిక్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఆయన తీసిన సినిమాలు అన్నీ విభిన్నమైనవే.

Singeetam Srinivasa Rao

మాటలు లేకుండా సినిమా, అడ్వెంచర్ సినిమా, ఫ్యాంటసీ సినిమా, సైన్స్ ఫిక్షన్ సినిమా, పాటలతోనే సినిమా ఇలా చెప్పుకుంటూ పోతే సింగీతం క్రియేట్ చేసిన వందర్స్ అన్నీ ఇన్నీ కావు.  సినిమా రంగాన్ని తన ప్రయోగశాలగా మార్చేసుకున్న ఏకైక మేధావి సింగీతం శ్రీనివాసరావు అని చెప్పాలి. ఆయన సినీ కెరీర్లో తెరకెక్కించిన కొన్ని కల్ట్ సినిమాల గురించి ఓ లుక్కేద్దాం రండి :

1)మయూరి (1984) : ఒకరి జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా తీయడం సర్వ సాధారణమైన విషయమే. కానీ, కాలు కోల్పోయి నృత్యానికి దూరమైన ఒక అద్భుతమైన నర్తకి, కృత్రిమ కాలితో మళ్లీ వేదికనెక్కిన కథను… స్వయంగా ఆ నర్తకి చేతే నటింపజేసి మెప్పించడం కేవలం సింగీతంకే చెల్లింది. నిజజీవితంలో ఆ నర్తకి మరెవరో కాదు. సుధా చంద్రన్ ‘మయూరి’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, కోట్లాది మందికి ఆదర్శం.

2)పుష్పక విమానం (1987) : సినిమా అంటే ఓ ఎమోషనల్ డ్రైవ్. దానిని మాటలతోనే మేజిక్ చేయాలి. మాటల్లేకపోతే ఎమోషన్ ఎలా పుట్టుకొస్తుంది. వాటికి తగ్గ పాటల్లేకపోతే సినిమాటిక్ లిబర్టీ ఎలా అవుతుంది? ఈ అనుమానాలను పటాపంచలు చేసి బ్లాక్ బస్టర్ ఇస్తే అది సింగీతం అనే మేధావి ఆలోచనల నుండీ వచ్చిన ‘పుష్పక్’/’పుష్పక విమానం’ అనే చెప్పాలి. కమల్ హాసన్ నటించిన ఈ సినిమా మాటల్లేకుండానే కడుపుబ్బా నవ్వేలా చేస్తుంది.

3)అపూర్వ సహోదరులు (1989) : ఇప్పుడు సీజీ అందుబాటులో ఉంది కాబట్టి ఎలాంటి వందర్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. కానీ 1980ల టైమ్లో కమల్ హాసన్ లాంటి స్టార్..ని పెట్టుకుని ఒక మరుగుజ్జు  పాత్రతో రివెంజ్ డ్రామాని నడిపించిన ఘనత కూడా సింగీతంకే చెల్లింది. ఈ సినిమా గురించి రాజమౌళి వంటి స్టార్స్ కూడా చాలా గొప్పగా చెప్పుకొచ్చారు.

4)ఆదిత్య 369′ (1991) : ఇండియన్ సినిమాకి ‘టైమ్ ట్రావెల్’ అనే కాన్సెప్ట్ ను పరిచయం చేసింది సింగీతం అనడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి భవిష్యత్తులోకి, అక్కడి నుంచి వర్తమానంలోకి సాగే ఈ ప్రయాణం.. ఆడియన్స్ కి ఓ సర్ప్రైజింగ్ ఫీల్ కలిగించింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

5)భైరవద్వీపం’ (1994) : గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే అద్భుతమైన విజువల్స్ తో, రాకుమారి, మాయల ఫకీరు, ఎగిరే మంచం లాంటి అంశాలతో ‘భైరవద్వీపం’ తీశారు సింగీతం. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

6) మేడమ్(1994) : ‘భైరవద్వీపం’ వచ్చిన ఏడాదే రాజేంద్రప్రసాద్, సౌందర్య..లతో ‘మేడమ్’ సినిమా తీశారు. రాజేంద్రప్రసాద్ తో మేడమ్ పాత్రని చేయించి కడుపుబ్బా నవ్వించారు సింగీతం. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది

7) లిటిల్ జాన్(2001) : మనిషి చిన్నగా అయిపోయి మామూలు ప్రపంచంలో పడే ఇబ్బందులను ‘లిటిల్ జాన్’ తో చూపించారు. ఈ సినిమా క్రిటిక్స్ ను మెప్పించింది.

8)సన్ ఆఫ్ అల్లాదీన్ (2003): ఇది హిందీలో రూపొందిన ఇండియన్ యానిమేటెడ్ సినిమా. క్రిటిక్స్ ను మెప్పించింది. పలు ఇంటెర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను సైతం అందుకుంది.

9)ఘటోత్కచ (2008) :  ఇది కూడా హిందీలో తీసిన యానిమేటెడ్ సినిమా. ‘మహాభారతం’లోని ఘటోత్కచ పాత్రని తీసుకుని ఫాంటసీ ఎంటర్టైనర్ గా మలిచారు సింగీతం. ఇది కూడా క్రిటిక్స్ ను మెప్పించి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ ను దక్కించుకుంది.

10) వెల్కమ్ ఒబామా :  సరోగసీ (అద్దె గర్భం) అనే సున్నితమైన అంశాన్ని ఆధారం చేసుకుని ‘వెల్కమ్ ఒబామా’ చిత్రాన్ని తీశారు సింగీతం. తర్వాత ఈ థీమ్ తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ‘వెల్కమ్ ఒబామా’ తో సింగీతం ఆ ట్రెండ్ ను స్టార్ట్ చేశారు. చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఈ సినిమా.

Sing Geetham Movie Review and Rating

11) సింగ్ గీతం: సినిమాలో మేజర్ పార్ట్ పాటలతోనే ఉంటుంది. పైగా 46 ఏళ్ళ క్రితం రాసుకున్న కథ. 94 ఏళ్ళ వయసులో డైరక్షన్ చేయడం. వినడానికే చాలా రిస్కీగా అనిపిస్తుంది. కానీ దీనిని ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించారు సింగీతం శ్రీనివాసరావు. బాక్సాఫీస్ వద్ద ఇది డీసెంట్ హిట్ గా నిలిచింది.

మొత్తంగా సింగీతం శ్రీనివాసరావు గారి ఫిల్మోగ్రఫీని గమనిస్తే.. ఇండియన్ సినిమా స్థాయిని పెంచే సినిమాలే ఆయన తీశారు. భౌతికంగా ఆయన మనకు దూరమై ఉండొచ్చు కానీ.. తాను తీసిన గొప్ప సినిమాల ద్వారా ప్రేక్షకుల గుండెల్లో ఆయన ఎప్పటికీ నిలిచిపోతారనడంలో ఎటువంటి సందేహం లేదు.

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Singeetam
  • #Singeetam Srinivasa Rao

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

14 mins ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

52 mins ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

21 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

24 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

25 seconds ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

1 day ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version