టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అన్నపూర్ణమ్మ వయస్సు 75 సంవత్సరాలు కాగా ఇప్పటికీ ఈ నటి వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఎఫ్3, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలలో ఈ మధ్య కాలంలో కనిపించిన అన్నపూర్ణమ్మ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. అన్నపూర్ణమ్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆడవాళ్లకు ఎందుకు స్వాతంత్య్రం కావాలని ప్రశ్నించారు.
అర్ధరాత్రి స్వాతంత్య్రం అన్న వెంటనే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా అని ఆమె కామెంట్లు చేశారు. రాత్రి 12 గంటల తర్వాత ఆడవాళ్లకు ఏం పని అని చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఎదుటివాళ్లదే తప్పు అనకూడదని మనవైపు కూడా కొంచెం ఉంటుందని అన్నపూర్ణమ్మ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు తన దృష్టికి రావడంతో చిన్మయి స్పందిస్తూ అన్నపూర్ణమ్మ యాక్టింగ్ స్కిల్స్ కు తాను ఫ్యాన్ అని ఆమె కామెంట్ల ప్రకారం ఎమర్జెన్సీ వచ్చి ఆస్పత్రికి వెళ్లినా రాత్రిపూట మహిళా డాక్టర్లు ఉండొద్దని అర్ధరాత్రి పూట గైనకాలజిస్టులు ఉండరు కాబట్టి పిల్లలు పుట్టకూడదంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.
ఇప్పటికీ చాలా ఊర్లలో బాత్రూమ్స్ లేవని చిన్మయి వెల్లడించారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్లపై అఘాయిత్యానికి పాల్పడాలని ఎదురుచూస్తున్న వాళ్లు ఉన్నారని చిన్మయి పేర్కొన్నారు. భారత్ లో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ అని ఆమె తెలిపారు. అయితే ఈ కామెంట్ల విషయంలో కొంతమంది అన్నపూర్ణమ్మను సపోర్ట్ చేస్తుంటే ఎక్కువమంది చిన్మయిని సపోర్ట్ చేస్తున్నారు.
అన్నపూర్ణమ్మ కామెంట్ల వెనుక అసలు ఉద్దేశం వేరని ఆమెను నిందించడం కరెక్ట్ కాదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. చిన్మయి ప్రస్తుతం సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. సమంత సినిమాల ద్వారా చిన్మయి ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు. సమంత (Chinmayi) చిన్మయి కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.