సింగర్ హెల్త్ కండీషన్ గురించి డాక్టర్స్ ఏం చెప్పారంటే..!

  • December 2, 2022 / 05:12 PM IST

గతకొద్ది రోజులుగా వరుస ప్రమాదాలు, మరణాలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పలు కారణాల వల్ల మృతిచెందారు. విశ్వనటుడు కమల్ హాసన్, కన్నడ స్టార్ ఉపేంద్ర వంటి వారు ఆసుపత్రిలో చేరారనే వార్తలతో అంతా షాక్ అయ్యారు. దీంతో, ఏ క్షణాన ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని సినిమా పరిశ్రమ వర్గాలవారు కంగారు పడుతున్నారు.. తాజాగా ప్రముఖ సింగర్ ప్రమాదానికి గురయ్యాడనే వార్త తెలిసింది.

బాలీవుడ్ పాపులర్ సింగర్ జుబిన్ నౌటియల్ ప్రమాదానికి గరువడంతో వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. ఈ న్యూస్ ఇప్పుడు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.. హిందీ ఇండస్ట్రీలో టాప్ సింగర్‌ అయిన జుబిన్ నౌటియల్.. తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లోనూ సూపర్ హిట్ సాంగ్స్ పాడి ప్రేక్షకులను అలరించాడు.. అల్లు అర్జున్ ‘సరైనోడు’ మూవీలో ‘తెలుసా తెలుసా’ అనే ఫీల్ గుడ్ మెలోడీ తన పాడిందే.. పలు బాలీవుడ్ టీవీ, వెబ్ సిరీస్‌లకు కూడా పాడాడు.

జుబిన్ గురువారం తన ఇంట్లో మెట్లు దిగుతూ ప్రమాద వశాత్తు జారి పడడంతో.. హుటాహుటిన ముంబాయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రమాదంలో జుబిన్ తలకు, పక్కటెముకలకు తీవ్రంగా గాయాలయ్యాయని.. డాక్టర్స్ ఆయన కుడిచేతికి ఆపరేషన్ కూడా చేశారని తెలుస్తుంది. అంతేకాదు కొంతకాలం వరకు తను కుడిచేయిని వాడకూడదని వైద్యులు సూచించారని బాలీవుడ్ వర్గాల వారి సమాచారం.

ఈ యంగ్ సింగర్ ఈ మధ్యే దుబాయ్‌లో సంగీత ప్రదర్శనలు ఇచ్చి, ఇండియా తిరిగొచ్చాడు. ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలుసుకున్న జుబిన్ నౌటియల్అభిమానులు సోషల్ మీడియాలో ‘గెట్ వెల్ సూన్ జుబిన్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా జుబిన్ నౌటియల్ త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో, ధృడంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తున్నారు..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus