శ్రేయ ఘోషల్.. ప్రేక్షకులకు ఆమె గురించి కొత్తగా పరిచయం చెయ్యనక్కర్లేదు.. ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో, మ్యూజిక్ హిస్టరీలో ఆమెదో ప్రత్యేకమైన స్థానం.. తన మధురమైన గాత్రంతో పలు భాషల్లో ఎన్నో మధురమైన పాటలు పాడి.. అన్ని చోట్లా అభిమానులను సంపాదించుకున్న ‘మెలోడీ క్వీన్’ శ్రేయ ఘోషల్.. టీవీ రియాలిటీ షోస్లోని సింగింగ్ కాంపిటిషన్ షోలతో కెరీర్ స్టార్ట్ చేసిన శ్రియ అనతి కాలంలోనే అగ్ర గాయనిగా ఎదిగి.. ఎంతోమంది అప్కమింగ్ సింగర్లకు ఆదర్శంగా నిలిచారు.
శ్రేయ ఘోషల్ పాడింది అని తెలిస్తే జనాలకు థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లంటేనే ఆమె క్రేజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. దాదాపు 10 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2015లో ప్రియుడు షిలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లాడారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. శ్రియ సంప్రదాయంగా చీరకట్టుకుని లేటెస్ట్గా ఫోటోషూట్ చేసింది. చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ.. చూడ ముచ్చటగా ఉన్న శ్రియ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!